పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సాధారణంగా ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే ఏం చేస్తుంటాం. వెంటనే గట్టిగా అరిచి.. అక్కడి నుంచి పరుగెడతాం. కానీ మధ్య ప్రదేశ్

పెళ్లైన మూడు సంవత్సరాల్లో 18 సార్లు ఇళ్లు మారిన జంట.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
House
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2021 | 11:33 PM

సాధారణంగా ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే ఏం చేస్తుంటాం. వెంటనే గట్టిగా అరిచి.. అక్కడి నుంచి పరుగెడతాం. కానీ మధ్య ప్రదేశ్ భోపాల్ కు చెందిన ఓ జంట మాత్రం ఏకంగా ఇళ్ళనే మార్చారు. ఒకటి కాదు రెండు కాదు.. మూడు సంవత్సరాలలో దాదాపు 18 ఇళ్ళ వరకు మార్చుకుంటూ వచ్చారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్యకు బొద్దింకలంటే చాలా భయం. దీంతో అతను తన భార్య కోసం దాదాపు 18 ఇళ్ళ వరకు షిఫ్ట్ అవుతూ వచ్చాడు. ఇక చివరకు విసుగు చెంది తన భార్యతో విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు.

2017లో వివాహం జరిగిన కొద్ది రోజులకే తనకు బొద్ధింకలు అంటే భయం అని ఆ భార్య తన భర్తకు చెప్పింది. ఒక రోజు భార్య వంటగదిలో ఉండగా.. అక్కడకు ఓ బొద్దింక వచ్చింది. ఇంకేముంది గట్టిగా అరుస్తూ.. హాల్లోకి పరిగెత్తింది. ఇక ఆ తర్వాత వంటగది వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆమె కోసం ఓ కొత్త ఇంటికి మాకాం మార్చాడు. 2018లో మొదటిసారిగా తన ఇంటిని మార్చాడు. ఇక ఆ తర్వాత అలా 18 సార్లు ఇళ్ళను మారుస్తూ వచ్చాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తన భార్యను అనేక మంది మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఎయిమ్స్ లో పనిచేస్తున్న డాక్టర్ ఓ మెడిసిన్ ఇవ్వగా అది తీసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. అంతేకాకుండా.. తన భర్త ఎప్పుడూ తన సమస్యను అర్థం చేసుకోలేదని.. తనను ఓ మానసిక రోగిలా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడని భార్య ఆరోపించింది. అదనపు కట్నం, గృహ హింస కేసులలో చిక్కుకునే పురుషుల కోసం పనిచేసే BHAI వెల్ఫేర్ సోసైటీ అనే సంస్థను ఈ జంట కలిసింది. అక్కడి వ్యవస్థాపకుడు జాకీ అహ్మద్ ఇచ్చిన సలహా వారికి పనిచేయలేదు. ఇక తన భార్య బొద్దింకను చూసినప్పుడు గట్టిగా అరుస్తూ.. ఇంట్లో వస్తువులను బయట పడెస్తుందని.. ఆమె చేష్టలతో విసిగిపోయానంటూ తనకు విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు.

Also Read: షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు.. 

ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి.. వెంటపడి మరీ తరిమికొట్టిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి