Assembly polls: అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ధారపోశారు.. నగదు, డ్రగ్స్, బంగారం ఎంత పట్టుబడిందో తెలిస్తే షాకవుతారు..
Election 2021: ఓట్ల కోసం.. కోట్లు.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో
Election 2021: ఓట్ల కోసం.. కోట్లు.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ధనం పట్టుబడింది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో ఇంకా ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. శనివారం ఐదో దశ ఎన్నికలు జరగుతున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో పార్టీలు ధనం, మద్యాన్ని ధారపోశాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. గతంలో 2016లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది ఊహించని విధంగా పెరిగిందంటూ ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు 2016 ఎన్నికల్లో సీజ్ చేసిన నగదు, మద్యం తదితర వాటిని పోలుస్తూ.. ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకూ స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలను ప్రకటించింది.
నగదు..
ఈసీ ప్రకటన ప్రకారం.. తమిళనాడులో అత్యధికంగా రూ.236.69 కోట్లు నగదు స్వాధీనం చేసుకోగా.. ఆ తర్వాత బెంగాల్‌లో రూ.50.71 కోట్లు, అస్సాంలో రూ.27.09కోట్లు, కేరళలో రూ.22.88 కోట్లు, పుదుచ్చేరిలో రూ.5.52కోట్ల మేర నగదును స్వాధీనం చేసుకుంది. బెంగాల్‌లో రూ.118 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోగా.. అసోంలో రూ.34కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్, మద్యం..
అలాగే అస్సాంలో రూ.41 కోట్ల విలువ చేసే మద్యం, బెంగాల్‌లో రూ.30 కోట్ల విలువైన మద్యం, తమిళనాడులో రూ.176 కోట్లు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకోగా.. కేరళలో రూ.50 కోట్లు, పుదుర్చేరిలో రూ.27కోట్ల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది.
వస్తువులు..
ఈ ఎన్నికల సందర్భంగా భారీగా పలు వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌లో రూ.88 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లు, తమిళనాడులో రూ.25 కోట్లు, అస్సాంలో రూ.15కోట్ల విలువైన గిఫ్ట్‌లను పట్టుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా వేయి కోట్లకు పైగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోందని ఈసీ పేర్కొంది.
Also Read: