Andhra government: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం.. సినీ వర్గాలతో ఏపీ సర్కార్ కీలక మీటింగ్
అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై అభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం సోమవారం సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను ఆహ్వానించింది వైసీపీ సర్కారు.
రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలోని సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టలన్న అంశంపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయితే, జగన్ ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. ఆన్‌లైన్ టికెట్ల వలన బ్లాక్ మార్కెట్ తగ్గుతుందని తెలిపింది సర్కారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గోట్టే అంశాలను ఆరికట్టవచ్చని వివరించారు మంత్రి పేర్ని నాని. సినిమాలకు లాభం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టాలని సినిమా ప్రముకులే ముఖ్యమంత్రి జగన్‌ని కోరారని రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ ఇచ్చారు పేర్ని నాని. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విధివిధాల ఖరారు చేసే పనిలో భాగంగా ప్రభుత్వం అందరి నుండి అభిప్రాయలు సేకరిస్తుంది. అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకంపై అభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం సోమవారం సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లను ఆహ్వానించింది వైసీపీ సర్కారు. సినిమా వర్గాల నుండి మంత్రి పేర్ని నానితో పాటు ఉన్నతాధికారులు సలహాలు తీసుకోనున్నారు.
టికెట్లు అమ్మకాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మగా వచ్చిన సొమ్మును, రియల్ టైంలో వారివారి అకౌంట్‌లకు ట్రాన్సఫర్ చేస్తామని స్పష్టమైన హమీ ఇవ్వనుంది ప్రభుత్వం. APFDC ద్వారానే ఆన్‌లైన్ టిక్కెటింగ్ పోర్టల్‌ను నిర్వహించనున్నట్టు సినీ నిర్మాతలకు వివరించనుంది జగన్ ప్రభుత్వం. అయితే, ప్రభుత్వంపై ఈ విషయంలో కాస్త విమర్శలు రావడంతో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ తర్వాత ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకంపై స్పష్టత రానుంది.
Also Read: Andhra Pradesh: ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీ