Crime News: ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో దారుణం.. చెత్త కుప్పలో శిశువు.. తీరా చూసేసరికి..
Crime News: మనుషులు రోజు రోజుకు మరీ కర్కశంగా మారుతున్నారు. పసిగడ్డు అని మానవత్వం కూడా లేకుండా పోతోంది.
Crime News: మనుషులు రోజు రోజుకు మరీ కర్కశంగా మారుతున్నారు. పసిగడ్డు అని మానవత్వం కూడా లేకుండా పోతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ ఘటన వెలుగు చూసింది. వారం రోజుల పసికందును రిమ్స్ ఆవరణలోని ఎఆర్‌టి సెంటర్ దగ్గర రోడ్డు పక్క చెల్లచెట్లలో పడేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. చిన్నారిని గమనించిన స్థానికులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన వైద్యాధికారులు.. చెత్త కుప్పలో పడిఉన్న శిశువును ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మృతదేహం వారం రోజుల మగ శిశువుదిగా నిర్ధారించారు వైద్యాధికారులు.
శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులకు సమాచారం అందించారు వైద్యాధికారులు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. శిశువు చనిపోయిన తరువాత పడేశారా? లేక పడేసి వెళ్లిపోతే శిశువు చనిపోయిందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. అలాగే శిశువును పారేసి వెళ్లిపోయిన వారి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని, సమీపంలోని సీపీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మనుషులు మరీ ఇంత దుర్మార్గంగా మారిపోతున్నారంటేంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
Also read:
Andhra Pradesh: సీఎం జగన్‌పై అయ్యన్న కామెంట్స్.. ఎమ్మెల్యే రోజా రియాక్షన్ మామూలుగా లేదు..