Rani Rudrama Devi: పల్నాడులో బయటపడ్డ పురాతన శాసనం.. వెలుగు చూసిన 800 ఏళ్లనాటి రహస్యం..!

కాకతీయుల వంశంలో ధ్రువతారగా వెలిగిన మహారాణి.. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో ఒకరిగా పేరొందిన కాకతీయ రాణి.. రాణి రుద్రమదేవీ మరణంపై మరో ఆధారం బయటపడింది. రుద్రమ మరణకాలాన్ని తెలియజేసే శాసనం పల్నాడు జిల్లాలోని కృష్ణానది ఓడ్డున ఉన్న బైరవ గుట్టపై లభ్యమైంది.

Rani Rudrama Devi: పల్నాడులో బయటపడ్డ పురాతన శాసనం.. వెలుగు చూసిన 800 ఏళ్లనాటి రహస్యం..!
Rani Rudrama Devi
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2023 | 4:18 PM

కాకతీయుల వంశంలో ధ్రువతారగా వెలిగిన మహారాణి.. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో ఒకరిగా పేరొందిన కాకతీయ రాణి.. రాణి రుద్రమదేవీ మరణంపై మరో ఆధారం బయటపడింది. రుద్రమ మరణకాలాన్ని తెలియజేసే శాసనం పల్నాడు జిల్లాలోని కృష్ణానది ఓడ్డున ఉన్న బైరవ గుట్టపై లభ్యమైంది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెంలో భైరవ గుట్టపై ఉన్న శాసనంలో ఆమె మరణానికి సంబంధించిన ఆనవాల్లు గుర్తించారు చరిత్రకారులు. ఆశాసనంలో ఏంముంది? అది ఎన్నేళ్లా నాటిది? వీరనారి కోసం రుద్రదేవుడు చేసిందేంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గుట్టపై ఉన్న శివాలయ, వెంకటేశ్వర శిథిలాలయం 2వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ బౌద్దులు నిర్మించినట్లు చెబుతున్నాయి ఆనవాళ్ళు. బౌద్ధుల ఆనవాళ్ళుగా భావించే అర్థ పద్మం, జంతువులు చెక్కిన పిల్లర్స్ భైరవేశ్వరాలయంగా చెప్పుకునే గర్భాలయంలో కనిపించాయి. అదే విధంగా మహా మండపం కట్టడంలో కూడా ఈ పిల్లర్స్ ను ఉపయోగించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న భైరవ గుట్టను బౌద్ధులు ఆవాసంగా మార్చుకున్నారు. తర్వాత కాలంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలంలో ఈ వెంకటేశ్వరాలయం నిర్మించినట్లుగా భావిస్తున్నారు. అయితే గుప్త నిధుల కోసం వేటగాళ్ళు ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు. విగ్రహాలను పగులకొట్టారు. ఆలయమని చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడ ఆనవాళ్లు మిగిలాయి.

రుద్రమ దేవి చనిపోయింది ఆ రోజే..

ఈ పురాతన ఆలయంలోనే రాణి రుద్రమ దేవి మరణానికి సంబంధించిన శాసనం ఉంది. ఈ వివరాలతో ఫైనల్ గా రుద్రమదేవీ 1289 సంవత్సరం నవంబర్ మాసంలో చనిపోయినట్లుగా చరిత్ర కారులు ఈమని శివనాగిరెడ్డి, హర గోపాల్ భావిస్తున్నారు. పుట్లగూడెం శాసనాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు.

ఇవి కూడా చదవండి

రాణి రుద్రమ దేవికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాలో బయటపడ్డాయి. శక సంవత్సరం 1210 విరోధి నామ సంవత్సరం, మకర సంక్రాంతి రోజు రుద్రదేవ మహారాజు.. రుద్రమ దేవికి పుణ్య లోకాలు ప్రాప్తించాలని భైరవేశ్వరునికి భూములు దానమిచ్చినట్లు ఈ శాసనం చెబుతుంది. అంటే 1289 సంవత్సరం డిసెంబర్ లో ఈ శాసనం వేసినట్లుగా చరిత్ర కారులు చెబుతున్నారు. అంతకుముందు రుద్రమ మరణానికి సంబంధించి రెండు శాసనాలున్నాయి‌. చందుపట్ల శాసనంలో 1289 నవంబర్ 25 తేదిన ఆమె దివ్య లోకాలకు చేరుకోవాలని కోరుకుంటూ భూములు దానం చేశారు. అదే విధంగా పల్నాడు జిల్లా ఈపూరు సోమేశ్వరాలయంలో ఉన్న శాసనంలో 1289 నవంబర్ 28న భూములు దానమిచ్చినట్లు ఉంది. ఆమె పేరుతోనే కాకుండా సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయిడు, అంగరక్షకుడు బొల్నియుడు కూడా పుణ్య లోకాలు కలగాలని కోరుకున్నట్లు ఉంది.

ఇప్పుడు ఈ రెండు శాసనాల వివరాలకు మద్దతుగా పుట్లగూడెం శాసనం కూడా బయటపడింది. అమరావతి రాజధానిలో మందడం వద్ద రాణా రుద్రమకు చెందిన అతి పెద్ద రాతి శాసనం ఉంది. ఈ ప్రాంతంపై ఆమె దండెత్తి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అదే విధంగా సైన్యాధ్యక్షుడు ఉద్దండ రాయుడు విడిది చేసిన గ్రామమే ఉద్దండ్రాయుని పాలెం అయిందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ శాసనం కూడా బయటపడటంతో రుద్రమ దేవికి సంబంధించిన ఆనవాళ్ళు అనేకం ఉండే పరిస్థితులున్నాయి‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..