Andhra Pradesh: టీడీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. హైకమాండ్ సీరియస్‌.. వేటు తప్పదా..?

యువగళంలో గరంగరం.. లోకేష్ పాదయాత్ర వంద రోజులు దాటిందన్న సంబరాల్లో ఉన్న టీడీపీకి కర్నూలు జిల్లాలో షాక్ తగిలింది.. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ నేతల్ని ఒక్క తాటిమీద నిలబెడుతూ నడుస్తున్న లోకేష్‌కు నంద్యాలలో మాత్రం రివర్స్‌ గేర్ తప్పలేదు. భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. పరస్పరం అరెస్టులు, కేసుల దాకా వెళ్లాయి.

Andhra Pradesh: టీడీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. హైకమాండ్ సీరియస్‌.. వేటు తప్పదా..?
Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2023 | 4:34 PM

యువగళంలో గరంగరం.. లోకేష్ పాదయాత్ర వంద రోజులు దాటిందన్న సంబరాల్లో ఉన్న టీడీపీకి కర్నూలు జిల్లాలో షాక్ తగిలింది.. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ నేతల్ని ఒక్క తాటిమీద నిలబెడుతూ నడుస్తున్న లోకేష్‌కు నంద్యాలలో మాత్రం రివర్స్‌ గేర్ తప్పలేదు. భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. పరస్పరం అరెస్టులు, కేసుల దాకా వెళ్లాయి. హతవిధీ అనుకుంటా యాక్షన్ ప్లాన్ షురూ చేసింది టీడీపీ హైకమాండ్.. లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో ఎంట్రీ ఇచ్చినవేళ.. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యపోరు.. ముష్టియుద్ధంగా మారింది. లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని ఎవరికివారు బలప్రదర్శనలో పోటీపడి చివరికిలా తిట్టుకున్నారు.. తనివితీరా తన్నుకున్నారు.. తొలుత మాటలయుద్ధం.. ఆ తర్వాత పరుష పదాలతో రెచ్చిపోవుడు.. తొడగొట్టి సవాళ్లు.. ఫలితం పిడిగుద్దులు..! ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారడంతో జడుసుకుని ఆస్పత్రిలో చేర్పించారు. అంతా అఖిలప్రియ సమక్షంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఫైటింగ్ సీన్లు.. స్టేట్‌వైడ్ టాపిక్కయ్యాయి.

Nandhyala

కట్‌ చేస్తే.. పోలీసుల ఎంట్రీ. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పీఎస్‌కు తరలించారు ఖాకీలు. ఆమెతో పాటు భార్గవరామ్, పీఏ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. డీజీపీతో ఫోన్‌లో మాట్లాడిన భూమా అఖిలప్రియ.. సుబ్బారెడ్డే తన చున్నీ లాగారని కౌంటర్‌గా మరో కంప్లయింట్ ఇచ్చారు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి గతంలో అత్యంత సన్నిహితుడు. భూమా దంపతుల మరణం తరువాత అఖిలప్రియతో పొసగలేదు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, టిక్కెట్ కోసం పోటీకొస్తున్నారని వైవీతో వైరం పెంచుకుంది అఖిలప్రియ వర్గం.

ఇప్పుడా రచ్చ రంబోలా అయ్యేసరికి పార్టీ అధిష్టానం సీరియస్సైంది. లొల్లికి అసలు కారణాలేంటి.. ఎవరి తప్పు ఎంతుంది.. ఎవరిమీద ఏమేం యాక్షన్ తీసుకోవచ్చు అనే అంశాలపై చర్చించడానికి త్రిసభ్య కమిటీ వేసింది. అటు… ఎవరితో మాట్లాడొద్దని, మీడియా ముందుకు వెళ్లవద్దని భూమా.. వైవీ వర్గాలకు హుకుం జారీ చేసింది టీడీపీ హైకమాండ్.

జరిగిన సంఘటన దురదృష్టకరమంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. యువగళం పాదయాత్రకు ఆటంకాలు కలిగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని.. టీడీపీ నేతలు క్రమశిక్షణతో సంయమనం పాటించాలని సూచించారు. భూమా.. వైవీ వర్గాల గొడవపై కమిటీ నివేదిక ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..