Andhra Pradesh: అమరావతి వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
అమరావతి విషయంలో ఏపీ సర్కార్‌కి బిగ్ రిలీఫ్ దొరికింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి విషయంలో ఏపీ సర్కార్‌కి బిగ్ రిలీఫ్ దొరికింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్-5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. 34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని, పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారని వివరించారు. CRDA చట్టం ని సెక్షన్ 53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని వాదించారు.
మరోవైపు, అమరావతి ప్రాంతంలో R-5 జోన్‌లో ఇళ్లస్థలాల విషయంలో వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతుల తరఫు న్యాయవాదులు వాదించారు. ఓట్ల రూపంలో ప్రభుత్వం లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని వాదించినట్లు తెలిపారు. ఇక ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం చెప్పలేదన్నారు. కానీ పట్టాల్లో థర్డ్ పార్టీ హక్కులు ఇవ్వొద్దని కోర్టు స్పష్టం చేసిందని సూచించినట్లు తెలిపారు. R5 జోన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. జగన్మోహన్‌రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
26 న పంపిణీ చేయనున్న సీఎం జగన్
కాగా.. సుప్రీంకోర్టు తీర్పుతో R5 జోన్లో ఇళ్ళ పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ నెల 26 న సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది. ఇళ్ళ పట్టాలు ఇచ్చే స్థలాల్లో రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 51 వేల 392 మంది లబ్దిదారులకు అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. ఐనవోలు, మందడం, కృష్ణాయ పాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, అనంతవరంలో పట్టాల పంపిణీ జరగనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..