TSRTC E-Buses: నెల రోజుల పాటు బంపర్ ఆఫర్.. ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) బస్సులు మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను నడపాలని టీఎస్‌ రోడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ( టీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది. ప్రజంట్ 10 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

TSRTC E-Buses: నెల రోజుల పాటు బంపర్ ఆఫర్.. ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు..
E Garuda
Follow us
Ram Naramaneni

|

Updated on: May 17, 2023 | 6:40 PM

ఎయిర్ పొల్యూషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలక్ట్రిక్‌ బస్సులను వాడుకలోకి తెచ్చిన విషయం విధితమే కదా. హైదరాబాద్ టూ బెజవాడ, బెజవాడ టూ హైదరాబాద్ ప్రజంట్ ఈ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఈ నయా బస్సుల ప్రారంభం నేపథ్యంలో ఈ-గరుడ బస్సుల్లో నెల రోజుల పాటు ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మియాపూర్‌ టూ విజయవాడకు రూ.830గా ఫిక్స్ చేసిన ధరను రూ.760కి, MGBS నుంచి విజయవాడకు రూ.780గా ఉన్న టికెట్‌ రేటును రూ.720కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌- విజయవాడ రూట్‌లో మంగళవారం 10 బస్సులు అందుబాటులోకి రాగా.. విడతలవారీగా 50 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు వివరించారు.  మిగతా బస్సులను ఈ సంవత్సరం ఎండింగ్‌ నాటికి రన్ చేసేలా అధికారులు ప్లాన్ చేస్తారు. 50 బస్సులు అందుబాటులోకి వస్తే… ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని  అధికారులు వివరించారు.

బస్సులు స్టార్ట్ అయ్యే టైమింగ్స్..

మియాపూర్ నుంచి : ఉదయం 6:25, ఉదయం 8:25, ఉదయం 10:25, సాయంత్రం 6:05, రాత్రి 7:45, రాత్రి 9:45 గంటలకు ఈ-గరుడ బస్సులు స్టార్టవుతాయి.

* MGBS నుంచి : ఉదయం 8:10, ఉదయం 10:10, మధ్యాహ్నం 12:10, రాత్రి 7:50, రాత్రి 9:30, రాత్రి 11:30 గంటలకు ఈ-గరుడ బస్సులు స్టార్టవుతాయి

* బెజవాడ నుంచి : ఉదయం 6:20, ఉదయం 8:00, ఉదయం 10:00, సాయంత్రం 6:40, రాత్రి 8:40, రాత్రి 10:40 గంటలకు ఈ-గరుడ బస్సులు బయలుదేరుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి