TTD News: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు అలర్ట్. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే, ఈ దఫా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది.

TTD News: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల..
TTD NEWS
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2023 | 7:56 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు అలర్ట్. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్‌ను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే, ఈ దఫా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే.. వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.

ఇక ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్‌లో టికెట్లు పొందిన వాళ్లు డబ్బులు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు.

శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదేవిధంగా రూ.300 దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఈ తేదీలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..