- Telugu News Photo Gallery Spiritual photos Shani jayanti 2023: these 5 famous temples of shani dev where every wish is fulfilled by worshiping all troubles are removed know more details
Shani Jayanti 2023: శని దేవుడి 5 ప్రసిద్ధ ఆలయాలు.. ఇక్కడ పూజలు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయ్..!
Shani Jayanti 2023: ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో శని దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాంటి పరిస్థితిలో శని దోషాన్ని తొలగించడానికి జ్యోతిష్య శాస్త్రంలోనే అనేక నివారణలు, పరిహారాలు సూచించడం జరిగింది.
Updated on: May 17, 2023 | 4:39 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడిని న్యాయం, ఫలితాలకు అధిపతిగా పేర్కొనడం జరిగింది. జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే సదరు వ్యక్తికి అంతా మంచే జరుగుతంది. అలా కాకుండా శని చెడు దృష్టి పడినట్లయితే.. ప్రతి ప్రయత్నం విఫలమే అవుతుంది. జీవితంలో అంతా చెడే జరుగుతుంది. అన్నింట్లోనూ నష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక, మానిసకి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే శని దేవుడిని పూజించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనీశ్వరుడిని పూజించడం ద్వారా అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. మన దేశంలో చాలా చోట్ల శని దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా 5 దేవాలయాలు శని దోష నివారణకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మరి ఆ టెంపుల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కోకిలావ్ ధామ్ (ఉత్తరప్రదేశ్): ఈ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కృష్ణా పట్టణంలో ఉంది. కోసిలోని ఈ శనిదేవ్ ఆలయాన్ని కోకిలవాన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో వరుసగా ఏడు శనివారాలు శని దేవుడికి ఆవాల నూనె సమర్పించిన వారి శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు. కేవలం దర్శనం ద్వారా తైలాన్ని సమర్పించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో కోకిల రూపంలో శనికి దర్శనం ఇచ్చాడు. అందుకే ఈ ప్రాంతానికి కోకిలవనంగా పేరు వచ్చింది.

శని ధామ్ ఆలయం (ఢిల్లీ): ఇది దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శని దేవాలయం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శని విగ్రహం ఇక్కడ ఉంది. శనిదేవుడిని పూజించేందుకు దూరప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శనిదోషం తొలగిపోతుందని నమ్ముతారు. మగవారు ఆలయ ప్రాంగణంలో స్నానం చేసి శని దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు.

శని మందిరం (కర్ణాటక): ఈ శని ధామం కర్ణాటకలోని తుంకూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయ విశేషమేమిటంటే శని దేవుడు కాకిపై ఆసీనుడై ఉంటాడు. మత విశ్వాసాల ప్రకారం.. వారి జాతకంలో శనిదోషం ఉన్నవారు, ఆచారాల ప్రకారం పూజలు చేస్తే, అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ విశ్వాసంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి వస్తుంటారు.

శని శింగనాపూర్ (మహారాష్ట్ర): శనిధామం ప్రస్తావన వచ్చినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది శని శింగనాపూర్ పేరు. ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూలల నుండి ప్రజలు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయ విశేషమేమిటంటే.. శనీశ్వరుడిని సందర్శించడం ద్వారా సడేసతి, ధైయా పరిస్థితి నుంచి ఉపశమనం పొందుతారు. శింగనాపూర్ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు తాళం కూడా వేయరు. కారణం శనీశ్వరుడి ఆలయం. శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగవని ప్రజల విశ్వాసం. ఒకవేళ దొంగలు పడినా.. శనిదేవుని ఆగ్రహానికి భయపడి దొంగలు పారిపోతారని చెబుతారు స్థానికులు.

తిరునల్లారు ఆలయం (తమిళనాడు): ఈ శనిదేవుని ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. మత విశ్వాసాల ప్రకారం.. రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే, శని దోషం తొలగిపోతుంది.





























