Renigunta: మహిళను నగ్నంగా కూర్చోబెట్టి క్షుద్రపూజలు.. టీడీపీ నేత అరెస్ట్
రేణిగుంట నగ్న పూజలపై రాజకీయ రగడ కొనసాగుతుంది. పూజలో నగ్నంగా కూర్చున్నాక లైంగిక దాడి చేశారని టీడీపీ నేత సుబ్బయ్యపై ఆరోపణ వచ్చాయి. ఇదే కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎమ్మెల్యే ఒత్తిడితోనే సుబ్బయ్యను కేసులో ఇరికించారని టీడీపీ ఆరోపిస్తుంది.

రేణిగుంట మండలం తారకరామ నగర్‌లో నగ్న పూజలు నిర్వహించి.. మహిళపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలపై టీడీపీ ఎస్సీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ కేసులో సుబ్బయ్యను కావాలనే ఇరికించారనేది టీడీపీ నేతల ఆరోపణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని సోషల్ మీడియాలో సుబ్బయ్య గతంలో కామెంట్ చేశారని.. అందుకే కేసు పెట్టించారనేది టీడీపీ వాదన.
టీడీపీ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన అంశాలు మాత్రం కలకలం రేపుతున్నాయి. సుబ్బయ్య తాంత్రిక పూజలు చేస్తారని స్థానికంగా గుర్తింపు ఉంది. దాంతో తనపై చేతబడి జరిగిందనే అనుమానంతో ఓ మహిళ విరుగుడు పూజల కోసం సుబ్బయ్యను సంప్రదించినట్టు పోలీసులు చెబుతున్నారు. పూజల కోసం 20 వేలకు బేరం కుదుర్చుకుని .. అడ్వాన్స్ కింద 7 వేల 500లు బాధితురాలు చెల్లించినట్టు పోలీసులు చెబుతున్నారు.
మహిళ ఇంట్లోనే పూజలు చేశారని.. అక్కడ ముగ్గు వేసి అందులో బాధిత మహిళను నగ్నంగా కూర్చోవాలని సుబ్బయ్య చెప్పడంతో ఆమె ఒప్పుకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఆపై మహిళపై సుబ్బయ్య లైంగిక దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సుబ్బయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వెర్షన్ ఇలా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం సుబ్బయ్య కేసును రాజకీయ కుట్రగానే చెప్పుకొస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
