AP Weather: మండే ఎండల్లో కూల్ న్యూస్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్
ప్రజంట్ మిడ్ సమ్మర్ నడుస్తుంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. రికార్డ్ రేంజ్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అయితే అసలు బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ సమయంలో కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్.
ద్రోణి/గాలుల నిలిపివేత ఆంధ్ర ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది. నైరుతి రుతుపవనాలు రాబోయే 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు విస్తరించే అవకాశమున్నది. కాగా ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర… రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ తెలికపాటి.. లేక ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం అవకాశం ఉందని వెల్లడించింది.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది.
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన తగ్గుదల ఉండే అవకాశము ఉన్నది.
శుక్రవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన తగ్గుదల ఉండే అవకాశము ఉన్నది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
బుధవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం చాలా ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉన్నది.
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.
శుక్రవారం:- ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.
రాయలసీమ :-
బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.
గురువారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడితో కూడిన మరియు అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే అవకాశము ఉన్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.
శుక్రవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నుండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం