కోనసీమలో కాకరేగిన అసమ్మతి.. టికెట్ కోసం పార్టీ నేతల ఆగ్రహం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో టిక్కెట్ ఫైట్ నడుస్తోంది. తమకు సీట్లు కేటాయించకుంటే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు. ఏపీలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో స్పెషల్ పెట్టాయి. దశలవారీగా క్యాండేట్లను ప్రకటిస్తూ వస్తున్నారు ఆయా పార్టీ అధినేతలు. ఈ క్రమంలో.. టిక్కెట్లు దక్కని ఆశావహులు.. సొంత పార్టీల్లోనే అసమ్మతి గళాలు ఎత్తుతున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీలో టిక్కెట్ ఫైట్ నడుస్తోంది. తమకు సీట్లు కేటాయించకుంటే తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు టీడీపీ శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు. ఏపీలో మరో నెలన్నర రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో స్పెషల్ పెట్టాయి. దశలవారీగా క్యాండేట్లను ప్రకటిస్తూ వస్తున్నారు ఆయా పార్టీ అధినేతలు. ఈ క్రమంలో.. టిక్కెట్లు దక్కని ఆశావహులు.. సొంత పార్టీల్లోనే అసమ్మతి గళాలు ఎత్తుతున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణలు కూడా తెరపైకి తెస్తున్నారు. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శెట్టిబలిజ సామాజిక వర్గం నేతలు సాధికార ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి టీడీపీ రామచంద్రపురం టిక్కెట్ కేటాయించకపోవడంపై టీడీపీ శెట్టిబలిజ సామాజికవర్గం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. రామచంద్రపురం ఇన్‌చార్జ్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు ఇచ్చి.. కష్టకాలంలో పార్టీకి ఉపయోగించుకుని.. ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.
రామచంద్రాపురంలో రెడ్డి సుబ్రహ్మణ్యానికి మాత్రమే గెలిచే దమ్ము ఉందని స్పష్టం చేశారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి వైసీపీ మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎమ్మెల్సీలు, రెండు ఎంపీ, ఒక రాజ్యసభ ఇచ్చిందని గుర్తు చేశారు టీడీపీ శెట్టిబలిజ సామాజికవర్గం నేతలు. మరోవైపు.. టిక్కెట్లు ఇవ్వలేని పక్షంలో కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసిన నేతలకు టీడీపీ ఎలాంటి న్యాయం చేస్తుందో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రెడ్డి సుబ్రమణ్యం. వైసీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయింపుపై పునరాలోచించాలన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన చరిత్ర తమ సామాజికవర్గానికి ఉందనే విషయాన్ని టీడీపీ గుర్తుంచుకోవాలని సూచించారు రెడ్డి సుబ్రమణ్యం. తామంతా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. కానీ.. నిన్నటి వరకు వైసీపీలో పదవులు అనుభవించి.. టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురి చేసి.. రాత్రికి రాత్రే పార్టీలోకి వస్తే టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినవారిని బాధపెట్టే నిర్ణయాలు అధిష్టానం తీసుకోవద్దని హెచ్చరించారు రెడ్డి సుబ్రమణ్యం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








