YS Jagan: వైనాట్ 175.. మేదరమెట్ల వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’.. సీఎం జగన్ ప్రసంగంపై ఉత్కంఠ..
ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం.. మేదరమెట్ల సభలో ఇదే ఆవిష్కరించబోతున్నారు సీఎం జగన్.. ఇప్పటి వరకు నిర్వహించిన సిద్ధం సభలు ఒక ఎత్తు.. ఈరోజు జరిగే మేదరమెట్ల సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార పార్టీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని సీఎం జగన్ వివరిస్తారని అంటోంది.

ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ముందు ఏం చేయబోతున్నాం.. మేదరమెట్ల సభలో ఇదే ఆవిష్కరించబోతున్నారు సీఎం జగన్.. ఇప్పటి వరకు నిర్వహించిన సిద్ధం సభలు ఒక ఎత్తు.. ఈరోజు జరిగే మేదరమెట్ల సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార పార్టీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని సీఎం జగన్ వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్‌గా బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతుంది వైసీపీ. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ. నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం 6 జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏకంగా 15 లక్షల మంది పార్టీ శ్రేణులను తరలించబోతుంది. ఉదయం 10 గంటల నుంచే పార్టీ శ్రేణులు సభా ప్రాంగణానికి చేరుకుంటాయి. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో సీఎం జగన్ సభాస్థలికి చేరుకుంటారు.
మేదరమెట్లలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరిస్తారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి తగ్గకుండా కార్యకర్తలను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మేదరమెట్ల సభకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది అధికార పార్టీ. ఇప్పటికే నిర్వహించిన మూడు సభల కంటే మరింత ప్రతిష్ఠాత్మకంగా ముగింపు సిద్ధం సభ నిర్వహించాలనుకుంటోంది. గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు మించి జనసమీకరణ చేయాలనుకుంటోంది.
రాష్ట్రంలో ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతీ సభలో ప్రజల ముందుంచుతున్నారు సీఎం జగన్. తన ప్రభుత్వంలో మీ ఇంట్లో మంచి జరిగిందంటే మరోసారి ఆశీర్వదించండి అంటూ తన ప్రసంగాల్లో పదే పదే చెప్తున్నారు. ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి మంచి చేస్తున్నామని వివరిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం మరింత మెరుగ్గా ఉండబోతుందని వైసీపీ చెప్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏదేళ్లలో చేపట్టబోయే ప్రగతి ప్రణాళికను సీఎం జగన్ ప్రజల ముందుంచుతారని అంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
సిద్ధం సభల నిర్వహణతో కొత్త ఊపుమీదున్న వైసీపీ.. ఈ ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవాలనుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




