వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కే.. ఆ పేటెంట్ హక్కు

రైతులకు ఉచిత విద్యుత్ పై పేటెంట్ వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లదే అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రైతులకు శాశ్వతంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న ఆయన.. దీనిపై టీడీపీ, కొన్ని పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కే.. ఆ పేటెంట్ హక్కు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 5:25 PM

రైతులకు ఉచిత విద్యుత్ పై పేటెంట్ వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లదే అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రైతులకు శాశ్వతంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న ఆయన.. దీనిపై టీడీపీ, కొన్ని పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని అన్నారు. విద్యుత్ కు సంబంధించి గత ప్రభుత్వాలు వేల కోట్లు బకాయిలు పెట్టాయన్న ఆయన.. రాష్ట్రంలో ఎడాపెడా అప్పులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు.కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణలు తీసుకువస్తోందని.. తప్పనిసరిగా రాష్ట్రం అమలు చేయాలని వివరణ ఇచ్చారు. ఉచిత విద్యుత్ ఎత్తివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరెంటు చార్జీలు పెంచిన ఘనుడు చంద్రబాబు అయితే, ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరితే.. చంద్రబాబు బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించారని గతాన్ని తవ్వుకొచ్చారు. రైతులు ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలగకుండా చేస్తున్నామని.. వచ్చే 30 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యుత్ సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసే అంశంపై మీడియా ముందుకొచ్చి పూర్తి స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు సజ్జల.