AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?

'ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడికి పోతోందీ రాష్ట్రం? సీఎం జగన్, డిఫాక్టో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు వ్యవహారాలు చూస్తున్న అవినాష్.. ఈ ముగ్గురే కుట్రదారులు..

ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?
Anil kumar poka
|

Updated on: Sep 04, 2020 | 5:43 PM

Share

‘ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడికి పోతోందీ రాష్ట్రం? సీఎం జగన్, డిఫాక్టో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు వ్యవహారాలు చూస్తున్న అవినాష్.. ఈ ముగ్గురే కుట్రదారులు. వీళ్ల డైరెక్షన్ లోనే మంత్రి కొడాలి నాని నన్ను లారీలతో గుద్దిస్తానని బెదిరిస్తున్నాడు.. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు టీడీపీ నేత దేవినేని ఉమ. కొడాలి నాని ఇవాళ మాట్లాడిన భాష చూస్తుంటే దారుణంగా ఉంది. ‘చదువు సంస్కారాన్నిస్తుంది. కానీ చదువు సంస్కారాలు లేని కొడాలి నాని… నీవు చంద్రబాబు వయసు గురించి, మా చావు పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకీ గల్లీ రాజకీయాలు? మీ చేతకాని తనం కప్పిపుచ్చుకోవడానికే ఈ భాష మాట్లాడుతున్నారా?’ అని కొడాలి నానిని టార్గెట్ చేశారు ఉమ. ఈరోజు మీడియా సమావేశంలో కొడాలి నానితో పాటు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ ఉన్నారు. నా ఒక్కడికి సమాధానం చెప్పడానికి ముగ్గురా…! ఏంటిది జగన్ గారూ? అంటూ దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టుగా ఇవాళ విద్యుత్ ఇవ్వలేక.. సోలార్ ఎనర్జీలో కమీషన్లకు కక్కుర్తిపడి.. మీటర్ల కొనుగోలులో వందల కోట్ల అవినీతికి సిద్ధపడి.. ఈ డ్రామా ముందుకు తీసుకువచ్చారని విమర్శలు గుప్పించారు. దీని గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక బూతుల మంత్రితో బూతులు మాట్లాడించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవినేని ఉమ. ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కిస్తున్నారని, మీటర్ల పేరుతో రైతుల గొంతు కోయబోతున్నారని, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సున్నా అయిందని, రైతు రుణాలకు వడ్డీలు కట్టించుకుంటున్నారని ఉమ.. జగన్ సర్కారుమీద ఆరోపణలు గుప్పించారు.

Follow Us
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే వణికిపోవాల్సిందే
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
రాఘవేంద్ర రావు మనసులో నిలిచిపోయిన పాట ఇదే..
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
చమురుపై అమెరికా ఆంక్షలు..పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ఛాన్స
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో.. విపత్కర పరిస్థితులు..!
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
ఓయోకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే
రూ.50 నోటుపై ఉన్న ఈ రథం చూశారా?రాతి స్తంభాల నుండి సంగీతం వినాలంటే