వెలుగు చూసిన అన్నమయ్య కాలం నాటి శాసనాలు

అన్నమయ్య ఎంత భక్తి.. అనురక్తితో వెంకన్న వైభవాన్ని ఆలపించారో.. తండ్రి బాటలో పెద్ద తిరుమలయ్య కూడా తన సాహిత్య ప్రతిభను చాటిచెప్పారు. కడప నుంచి తిరుమలకు చేరుకునే అన్నమయ్య మార్గంలో...

వెలుగు చూసిన అన్నమయ్య కాలం నాటి శాసనాలు
Follow us

|

Updated on: Jul 04, 2020 | 6:35 PM

Inscriptions Dating Back : అదివో.. అల్లదివో.. అంటూ అనురక్తితో తిరుమలేశుడిని కొలిచిన అన్నమయ్య.. భావి తరాలకు ఎన్నో కీర్తనలను అందించారు. అయితే అన్నమయ్య కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలయ్య సాహితీ సంపద తాజాగా వెలుగులోకి వచ్చింది. శేషాలచం అటవీ ప్రాంతంలో ఓ శాసనం బయటపడింది.

అన్నమయ్య ఎంత భక్తి.. అనురక్తితో వెంకన్న వైభవాన్ని ఆలపించారో.. తండ్రి బాటలో పెద్ద తిరుమలయ్య కూడా తన సాహిత్య ప్రతిభను చాటిచెప్పారు. కడప నుంచి తిరుమలకు చేరుకునే అన్నమయ్య మార్గంలో పెద్ద తిరుమలయ్య ఏర్పాటు చేసిన శాసనాన్ని పురావస్తు శాఖ గుర్తించింది.

శేషాచలం ఫారెస్ట్‌లోని గుండ్లకోనలో బయటపడిన ఈ శాసనం 483 ఏళ్ల కిందటిదని పురావస్తు అధికారులు నిర్ధారించారు. నాలుగు శతాబ్దాల క్రిందట ఇక్కడ హనుమంతుడి విగ్రహం ప్రతిష్టించిన సమయంలో పెద్ద తిరుమలయ్య ఈ శాసనం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

అన్నమయ్య “అచ్చ తెనుగు” పదాలతో వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ కీర్తనలు రచించారు. గానం చేశారు. అయితే తాజాగా వెలుగుచూసిన పెద్ద తిరుమలయ్య శాసనం గ్రాంధిక భాషలో లిఖించబడి ఉంది.ఈ శాసనం ద్వారా ఆనాటి సామాజిక పరిస్థితులు తెలిసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.