ఏపీ సీఎం నివాసం వద్ద కరోనా కలకలం..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. రోజు రోజుకూ వైరస్ సమీకరణాలు భయానకంగా మారిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు ఇలా అందరినీ కరోనా వెంటాడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం వద్ద..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. రోజు రోజుకూ వైరస్ సమీకరణాలు భయానకంగా మారిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, వైద్యులు, పోలీసులు ఇలా అందరినీ కరోనా వెంటాడుతోంది. శుక్రవారం రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం వద్ద కూడా కోవిడ్ కల్లోలం రేపుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా పదిమంది సిబ్బంది కరోనా వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.
తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద కరోనా కలకలం రేపుతోంది. ఏపీలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 10 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఏపీఎస్పీ కాకినాడ బెటాలియన్‌కు చెందిన 8 మంది సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. మరో బెటాలియన్‌కు చెందిన ఇద్దరు గార్డులు కరోనా పాజిటివ్‌గా తేలారు. జూలై 2న సీఎం నివాసం వద్ద గార్డులకు కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే, టెస్టుల ఫలితాలను ఈ రోజు వెల్లడించారు. ఈ ఫలితాల్లో పది మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో సీఎం కార్యాలయం కలకలం మొదలైంది. గతంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది.