కరోనా ఉధృతి.. 6 నగరాల నుంచి విమానాలకు బెంగాల్ నో ఎంట్రీ

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోల్ కతా విమానాశ్రయం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెన్నై, అహమ్మదాబాద్ నగరాల నుంచి తాము సిటీలోకి విమానాలను..

కరోనా ఉధృతి.. 6 నగరాల నుంచి విమానాలకు బెంగాల్ నో ఎంట్రీ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 7:42 PM

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోల్ కతా విమానాశ్రయం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెన్నై, అహమ్మదాబాద్ నగరాల నుంచి తాము సిటీలోకి విమానాలను అనుమతించబోమని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్ఛేవరకు ఈ ఆదేశాలు  ఈ నెల 6 నుంచి 19 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. కోవిడ్-19 హాట్ స్పాట్ ప్రాంతాల నుంచి విమానాలను నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో కోల్ కతా విమానాశ్రయ అధికారులు తామే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే కోల్ కతా నుంచి బయల్దేరే విమానాలకు ఈ బ్యాన్ వర్తించబోదు. దేశంలో ఇప్పటివరకు 6.48 లక్షల మంది కరోనా వైరస్ కి గురయ్యారు. 18,500  మంది కరోనా రోగులు మరణించారు.