CM YS Jagan: సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి జీతాలు పెంపు.. పలు కీలక ఆదేశాలు జారీ..

YS Jagan Key Decisions: వంశపారంపర్య అర్చకులకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వారికి 20 శాతం మేరకు జీతాలను పెంచుతూ..

CM YS Jagan: సీఎం జగన్ గుడ్ న్యూస్.. వారికి జీతాలు పెంపు.. పలు కీలక ఆదేశాలు జారీ..
Ap Cm Jagan
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2021 | 6:48 PM

వంశపారంపర్య అర్చకులకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. వారికి 20 శాతం మేరకు జీతాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే వంశపారంపర్య అర్చకులకు రిటైర్‌మెంట్ తొలగింపును కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజాగా దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తే.. ఎక్కడా కూడా అవినీతికి చోటు ఉండదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తోన్న మంచి విధానాలను ఇతర దేవాలయాల్లోనూ ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఉత్తమ నిర్వహణా పద్దతులను అమలులోకి తీసుకురావాలని.. ఆన్‌లైన్ విధానం నుంచి నాణ్యమైన ప్రసాదాల తయారీ వరకూ టీటీడీ విధానాలను పాటించాలన్నారు. ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఆన్‌లైన్ పద్దతులను కొనసాగించాలన్నారు. దాతలు ఎవరైనా కూడా ఆన్‌లైన్ ద్వారా విరాళాలను ఇవొచ్చునని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆన్లైన్‌ పద్ధతులను, విధానాలను తెలియజేస్తూ ప్రతి దేవాలయంలో పెద్ద బోర్డులను పెట్టాలన్నారు. అలాగే దాతలు ఇచ్చిన విరాళాలను ఆలయాల అభివృద్ధికి వాడుకోవాలని.. పక్కదోవ పట్టకుండా నేరుగా దేవాలయాలకు ఉపయోగపడాలని అధికారులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు దేవాలయ భూముల పరిరక్షణలో భాగంగా ప్రతీ జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, ఒక ప్రభుత్వ న్యాయవాదితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. దేవాలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేసి, వాటిని జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. సమగ్ర భూ సర్వేలో దేవాలయ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని సుమారు 18 వేల ఆలయాల్లో భద్రత కోసం సుమారు 47 వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ”ఎక్కడ ఆలయాలు ఉన్నా.. వాటి భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టేలా చూడాలని” అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌, సెక్యూరిటీ కోసం ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని సీఎం అన్నారు. దేవాలయాల్లో భద్రత, తదితర అంశాలపై పోలీసుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Also Read:

పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?

కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ