పోలవరం కలలాగే మిగిలిపోతుంది: బాబు ఆవేదన
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పోలవరం 70శాతం పూర్తైందని.. మిగిలిన 30శాతం పూర్తి చేయకపోతే అది కలలాగే మిగిలిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్లు, ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎలా మళ్లించారని ప్రశ్నించారు. అవహేళనల్ని, ఆరోపణల్ని ఎదుర్కుంటూనే 70శాతం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశామని […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పోలవరం 70శాతం పూర్తైందని.. మిగిలిన 30శాతం పూర్తి చేయకపోతే అది కలలాగే మిగిలిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్లు, ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీరు ఎలా మళ్లించారని ప్రశ్నించారు. అవహేళనల్ని, ఆరోపణల్ని ఎదుర్కుంటూనే 70శాతం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
ఇక వరద సమయంలో ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న కంపెనీలను వెనక్కు వెళ్లిపోమంటూ నోటీసులు ఇచ్చారంటే.. ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల మీకున్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్ధమవుతోందని జగన్‌పై చంద్రబాబు విమర్శించారు. అలాగే కృష్ణానది ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాల్లో నీళ్లు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వదర జలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోందని.. నదుల అనుసంధాన ప్రయోజనం ఇదేనని.. పట్టిసీమ వృథా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదని చంద్రబాబు ట్వీట్ చేశారు.
పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు, ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. అవహేళనలని, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70శాతం నిర్మాణం పూర్తిచేసాం. ఇంతాచేసినా మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది. pic.twitter.com/ZICPBtp55O
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 1, 2019
కృష్ణానది ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలలో నీళ్ళు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వరద జలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోంది. నదుల అనుసంధాన ప్రయోజనం ఇదే. పట్టిసీమ వృధా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు.
Pics Courtesy: Kaushik pic.twitter.com/RaYGMZxu5T
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 1, 2019