దమ్ముంటే ట్వీట్ చేయవయ్యా.. విజయసాయిరెడ్డి పై ఉమా ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయవయ్యా… ఇంటర్ పోల్ నిందితులు మీరు, మీ సహచరుడిని అరెస్టు చేస్తే.. విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు. దమ్ముంటే వీటి పై ట్వీట్ చెయ్యి అంటూ ధ్వజమెత్తారు. అవినీతి పరులు.. నీతి సూత్రాలు వల్లిస్తున్నారని దేవినేని ఆరోపించారు. నువ్వా నన్ను బెదిరించేది నీలాగా నేను అక్రమాలకు పాల్పడలేదని విమర్శించారు. పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారని.. […]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయవయ్యా… ఇంటర్ పోల్ నిందితులు మీరు, మీ సహచరుడిని అరెస్టు చేస్తే.. విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు. దమ్ముంటే వీటి పై ట్వీట్ చెయ్యి అంటూ ధ్వజమెత్తారు. అవినీతి పరులు.. నీతి సూత్రాలు వల్లిస్తున్నారని దేవినేని ఆరోపించారు. నువ్వా నన్ను బెదిరించేది నీలాగా నేను అక్రమాలకు పాల్పడలేదని విమర్శించారు. పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారని.. పునాదులు లేపకపోతే.. స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు పడిన కష్టానికి నిదర్శనం పోలవరం ప్రాజెక్టు.. పనులను రెండు నెలల నుంచి నిలిపివేసిన పాపం మీదే అని ఆయన అన్నారు. ఎర్రబస్సు ఎక్కి వచ్చామని.. విజయసాయిరెడ్డి లాగా విమానాలు ఎక్కి రాలేదని ఎద్దేవా చేశారు.