AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నా క్యాంటీన్లు మూసివేయడం లేదు: మంత్రి బొత్స క్లారిటీ

ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. తాము వాటిని మూసివేయాలనుకోవడం లేదని, అసలు తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు. త్వరలోనే కొన్ని మార్పులు చేసి రాయితీతో అన్నార్తులకు ఆహారాన్ని అందించనున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ రాద్దాంతం చేస్తున్నాయని బొత్స విమర్శించారు. గత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా వీటిని ఏర్పాటు చేసిందని, […]

అన్నా క్యాంటీన్లు మూసివేయడం లేదు: మంత్రి బొత్స క్లారిటీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 02, 2019 | 9:38 AM

Share

ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. తాము వాటిని మూసివేయాలనుకోవడం లేదని, అసలు తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు. త్వరలోనే కొన్ని మార్పులు చేసి రాయితీతో అన్నార్తులకు ఆహారాన్ని అందించనున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ రాద్దాంతం చేస్తున్నాయని బొత్స విమర్శించారు.

గత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా వీటిని ఏర్పాటు చేసిందని, దీనివల్ల సరైన ప్రయోజనం చేకూరడం లేదని తెలిపారు మంత్రి బొత్స. ఆహారాన్ని అందించిన సంస్ధకు రూ.40 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు ఉండిపోయాయని, కనీసం నిర్వహణ ఖర్చును కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమో వాటిని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తామని.. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకుంటే మంచిదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..