బాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ.. డీజీపీ క్లారిటీ..!

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారన్న వార్తను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ కల్పిస్తున్నామని తెలిపింది. ఆయనకు కల్పిస్తోన్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం చంద్రబాబుకు జడ్‌ప్లస్ సెక్యూరిటీతో భద్రత ఇస్తున్నామని.. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం టీడీపీ అధినేతకు 183మందితో భద్రతను కల్పిస్తున్నామని వెల్లడించింది. చంద్రబాబు విజయవాడలో ఉన్నప్పుడు ఆయనకు […]

  • Updated On - 4:52 pm, Wed, 19 February 20 Edited By: Venkata Rao
బాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ.. డీజీపీ క్లారిటీ..!

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత కుదించారన్న వార్తను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ కల్పిస్తున్నామని తెలిపింది. ఆయనకు కల్పిస్తోన్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం చంద్రబాబుకు జడ్‌ప్లస్ సెక్యూరిటీతో భద్రత ఇస్తున్నామని.. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం టీడీపీ అధినేతకు 183మందితో భద్రతను కల్పిస్తున్నామని వెల్లడించింది.

చంద్రబాబు విజయవాడలో ఉన్నప్పుడు ఆయనకు 135మంది, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు 48మందితో భద్రతను చేపట్టామని డీజీపీ కార్యాలయం తెలిపింది. కాగా చంద్రబాబుకు, లోకేష్‌కు భద్రతను తగ్గించి వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. బాబుకు టెర్రరిస్టు, మావోలు, స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఎన్‌ఎస్‌జీ జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించిందని పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది.