Chandrababu bus yatra: కాసేపట్లో బాబు చైతన్యయాత్ర.. ఇదీ షెడ్యూల్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు చంద్రబాబు బస్సు యాత్రను ఎంచుకున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనున్నది.
TDP President Chandrababu to launch Praja Chytanya Yatra today: టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డెక్కనున్నారు. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు బుధవారం శ్రీకారం చుడుతున్నారు. ప్రకాశం జిల్లాలో తొలుత యాత్రను ప్రారంభించి.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరపబోతున్నారు. ఇందుకోసం తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో జరిగిన తొమ్మిది రద్దులు, తొమ్మిది మోసాలు, తొమ్మిది భారాలు.. అంటూ ఎజెండాను సిద్దం చేసుకున్నారు చంద్రబాబు.
బుధవారం ప్రకాశం జిల్లా నుండి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు…మార్టూరు, మేదరమెట్ల, ఒంగోలులలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు బొప్పూడి చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తారు.
@ 11.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు.
@ 12.30 గంటలకు మార్టూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
@ 12.50 గంటలకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.
@ 2.20 గంటలకు మేదరమెట్ల బహిరంగ సభలో ప్రసంగిస్తారు…
@ 6 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగిస్తారు…
@ రాత్రి 8గంటలకు టీడీపీ నాయకులతో సమావేశం…
@ రాత్రి 10 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరుగు పయనం
అయితే.. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద చర్చ జరగుతోంది. ఆయనకు భద్రత తగ్గించారన్న ప్రచారాన్ని ఏపీపోలీసులు తోసిపుచ్చారు. చంద్ర బాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ప్రకటించారు. దేశంలోనే అత్యంత హై – సెక్యూరిటీని ఆయనకు కల్పిస్తున్నామని, ప్రస్తుతం Z+ సెక్యూరిటీలో చంద్ర బాబు భద్రత కల్పిస్తున్నామని ప్రకటించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబుకు 83 మందితో భద్రత కల్పిస్తున్నామని, విజయవాడలో 135 మంది….హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ భద్రత ప్రజా చైతన్య బస్సు యాత్రలో కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.