AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచువారి ‘ఎన్టీఆర్‌’ సిరీస్.. తెరపైకి ‘నందమూరి’ సీక్రెట్స్..!

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌‌ జీవితం గురించి అందరికి తెలిసింది చాలా తక్కువే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన జీవితంలో జరిగిన మలుపుల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక ఆయన జీవిత అంశాల ఆధారంగా వచ్చిన సినిమాలలో కూడా అన్ని వివరాలు చూపించలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌కు సంబంధించిన రహస్యాలపై వెబ్‌సిరీస్ రానున్నట్లు తెలుస్తోంది. ‘చదరంగం’ పేరుతో తెరకెక్కబోతున్న వెబ్‌సిరీస్‌లో ఎన్టీఆర్ రహస్యాలను చూపించబోతున్నారట. అనంత ఈ […]

మంచువారి 'ఎన్టీఆర్‌' సిరీస్.. తెరపైకి 'నందమూరి' సీక్రెట్స్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2020 | 4:43 PM

Share

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌమ ఎన్టీఆర్‌‌ జీవితం గురించి అందరికి తెలిసింది చాలా తక్కువే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన జీవితంలో జరిగిన మలుపుల గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఇక ఆయన జీవిత అంశాల ఆధారంగా వచ్చిన సినిమాలలో కూడా అన్ని వివరాలు చూపించలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌కు సంబంధించిన రహస్యాలపై వెబ్‌సిరీస్ రానున్నట్లు తెలుస్తోంది.

‘చదరంగం’ పేరుతో తెరకెక్కబోతున్న వెబ్‌సిరీస్‌లో ఎన్టీఆర్ రహస్యాలను చూపించబోతున్నారట. అనంత ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. మంచు విష్ణు నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ సిరీస్‌లో ఫ్యామిలీ నటుడు శ్రీకాంత్, ఎన్టీఆర్ పాత్రలో కనిపించబోతున్నారట. కాగా ఈ సిరీస్‌కు కావాల్సిన ఇన్‌పుట్స్‌ను విలక్షణ నటుడు మోహన్ బాబు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్‌తో మోహన్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉండేదన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు.. ఆ తరువాత ఆయన పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఎన్టీఆర్‌ చివరి రోజుల్లోనూ మోహన్ బాబు ఆయనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన చాలా రహస్యాలు విలక్షణ నటుడి దగ్గర ఉండగా.. ఆ వివరాలతోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని., త్వరలోనే ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో చదరంగం విడుదల కానుందని సమాచారం.

షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ
షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ
కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌
కన్ఫామ్‌ టిక్కెట్లపై రైల్వే శాఖ కొత్త రూల్స్‌
కేంద్ర ప్రభుత్వం కీలక డెసిషన్.. వాటిల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం కీలక డెసిషన్.. వాటిల్లో మార్పులు
గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వాయమ్మో జర జాగ్రత్త..
చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వాయమ్మో జర జాగ్రత్త..
చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
చలికాలంలో ఆవిరి పడుతున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
SIP వర్సెస్‌ PPF.. నెలకు రూ.7500 ఎందులో పెడితే మంచిది!
SIP వర్సెస్‌ PPF.. నెలకు రూ.7500 ఎందులో పెడితే మంచిది!
పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఆధార్ ద్వారా సెకన్లలోనే అప్డేట్
పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఆధార్ ద్వారా సెకన్లలోనే అప్డేట్
ధోనీతో ఆడాలనేదే నా కల..ఆ తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కార్తీక్
ధోనీతో ఆడాలనేదే నా కల..ఆ తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కార్తీక్
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..