దూకుడు పెంచుదాం… ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు!

ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దిశానిర్దేశం చేశారు. పోలవరం, రాజధాని విషయాల్లో ముందుకే వెళ్లాలని తీర్మానం చేశారు. పోలవరంపై పీపీఏ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతిలో నిర్మాణాలను కొనసాగించేలా […]

దూకుడు పెంచుదాం... ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు!
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 1:38 AM

ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దిశానిర్దేశం చేశారు. పోలవరం, రాజధాని విషయాల్లో ముందుకే వెళ్లాలని తీర్మానం చేశారు. పోలవరంపై పీపీఏ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతిలో నిర్మాణాలను కొనసాగించేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సమావేశంలో తీర్మానించారు. గత ప్రభుత్వం తప్పుచేస్తే శిక్షించాలి కానీ ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీలో విభిన్న అభిప్రాయాలు ఉండకూడదని ఒకే నిర్ణయంతో అంతా ముందుకు వెళ్లాలని తీర్మానించారు.

వైసీపీతో బీజేపీ సన్నిహితంగా ఉంటుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు సమదూరం పాటించాలని నిర్ణయం సమావేశంలో తీర్మానించారు. మూడు నెలల్లోనే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిందేనని తీర్మానం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులనూ వదలొద్దని ప్రజల్లో తీవ్రంగా విమర్శించాలని నిర్ణయించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ సంస్థాగతంగా ఎదిగేందుకు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని తీర్మానించారు. స్థానికసంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలని రామ్ మాధవ్ సూచించారు. రాజధాని అమరావతిలో లేదా విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు