AP News: ఏపీలో ఓ యువకుడి వింతకష్టం.. బతికే ఉన్నా.. రికార్డ్స్‌లో కూడా బతికించండి అంటూ వేడుకోలు

Surya Kala

Surya Kala |

Updated on: Oct 07, 2021 | 4:52 PM

AP News: కర్నూలు జిల్లాలో ఓ యువకుడు వింత కష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. అధికారుల తప్పిదం కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ..

AP News: ఏపీలో ఓ యువకుడి వింతకష్టం.. బతికే ఉన్నా.. రికార్డ్స్‌లో కూడా బతికించండి అంటూ వేడుకోలు
Kurnool Man

Follow us on

AP News: కర్నూలు జిల్లాలో ఓ యువకుడు వింత కష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. అధికారుల తప్పిదం కారణంగా.. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేక పోతున్నారు. బ్రతికి ఉన్న చచ్చిన వాడి లాగా జీవితం గడుపుతున్నాడు. రియల్ గా బతికిఉన్న తనను రికార్డ్ ల్లో కూడా బతికించమని కోరుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

30 సంవత్సరాల శ్రీ రామ్ రెడ్డిది.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నరసాపురం స్వగ్రామం. ఉపాధి కాని వ్యవసాయ భూమి కాని లేదు. కూలి పనులకు వెళ్లి బతుకుతున్నాడు. పదిహేను సంవత్సరాల క్రితమే తల్లిదండ్రులు చనిపోయారు. సొంత ఇల్లు కూడా లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. మూడు సంవత్సరాలుగా తనకు రేషన్ కార్డు ఇవ్వండి అని కలెక్టర్ కార్యాలయం చుట్టూ.. ఏర్పడినప్పటి నుంచి గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. లాభం లేదు. పైగా వింత సమస్య ఎదురయింది. రికార్డుల ప్రకారం నీవు బ్రతికి లేవు చనిపోయావూ… అని అధికారులు చెప్పడంతో నిజంగా చనిపోయిన అంత పని అయింది. రేషన్ కార్డు కోసం పెట్టుకున్న దరఖాస్తులలో ఆధార్ కార్డు కూడా జత చేశాడు. ఆధార్ కార్డును చూసిన సచివాలయ సిబ్బంది…. నీవు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. దీంతో నీకు రేషన్ కార్డు రాదు అని చావు కబురు చల్లగా చెప్పారు. ఆరు నెలల క్రితం కలెక్టర్ కార్యాలయంలో తన వింత కష్టం పై ఫిర్యాదు కూడా చేశాడు లాభం లేకుండా పోయింది. మూడు సంవత్సరాలుగా ఇంకా తిరుగుతూనే ఉన్నాడు తప్ప ఆన్లైన్లో తాను చచ్చిన వాడి లాగా కాకుండా బతికి ఉన్నట్లు చేర్చండి అని బ్రతిమాలు తున్నాడు. ఎవరు కనికరించడం లేదు అని వాపోతున్నారు శ్రీ రామ్ రెడ్డి

ఈ విషయంపై అటు సచివాలయ సిబ్బంది గాని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది గాని స్పందించడం లేదు. ఇప్పటికైనా ఈ వార్త చూసి ఎవరైనా శ్రీ రామిరెడ్డిని రికార్డుల్లో బ్రతికించవలసిన అవసరం ఉంది.

Reporter: Nagi Reddy Tv9 telugu, Kurnool

Also Read:  తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఫోకస్..ఈనెల 9న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్న జనసేనాని..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu