AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన వైద్యుడు.. అదనపు కట్నం తేవాలని భార్యకు వేధింపులు.. చివరికి

కూతురు జీవితం సంతోషంగా ఉండాలని వైద్యుడైన అల్లుడు కోసం చూశారు ఆ కుటుంబ సభ్యులు. డాక్టర్ బాబు‎తో వివాహం చేస్తే.. తమ కూతురు జీవితం సాఫీగా సాగుతుందనుకున్నారు. కూతురు జీవితం బాగుంటే చాలులే అనుకుని.. కట్న కానుకలు భారీగానే సమర్పించుకుని పెళ్లి చేశారు. ఆ తర్వాత.. ఆ దంపతులకు ఓ కొడుకు కూడా పుట్టాడు. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వారి కాపురంలో.. అప్పులు కలహాలు మొదలయ్యాయి.

Andhra Pradesh: వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన వైద్యుడు.. అదనపు కట్నం తేవాలని భార్యకు వేధింపులు.. చివరికి
Sai Sudhher And Sathyavani
Maqdood Husain Khaja
| Edited By: Aravind B|

Updated on: Aug 25, 2023 | 1:23 PM

Share

విశాఖపట్నం, ఆగస్టు 25: కూతురు జీవితం సంతోషంగా ఉండాలని వైద్యుడైన అల్లుడు కోసం చూశారు ఆ కుటుంబ సభ్యులు. డాక్టర్ బాబు‎తో వివాహం చేస్తే.. తమ కూతురు జీవితం సాఫీగా సాగుతుందనుకున్నారు. కూతురు జీవితం బాగుంటే చాలులే అనుకుని.. కట్న కానుకలు భారీగానే సమర్పించుకుని పెళ్లి చేశారు. ఆ తర్వాత.. ఆ దంపతులకు ఓ కొడుకు కూడా పుట్టాడు. కొన్నాళ్లపాటు సాఫీగా సాగిన వారి కాపురంలో.. అప్పులు కలహాలు మొదలయ్యాయి. ఆ డాక్టర్ జూదానికి అలవాటపడ్డాడు. వైద్య వృత్తిలో ఉంటూనే.. వ్యసనాలకు బానిసై అప్పుల పాలై మునిగిపోయాడు. ఇక ఆ అప్పులు తలకు మించిన భారం అవ్వడంతో.. అదనపు కట్నం తీసుకురమ్మని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త మారుతాడులే అనుకొని బాధను దిగమింగుకొని భరించింది ఆ వివాహిత. కానీ నానాటికి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఇక..డాక్టర్ భర్త వేధింపులకు తనువు చాలించాలనుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ జిల్లా మధురవాడ మెదలాపురి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.

విశాఖపట్నం మధురవాడ, మిథిలపూరీ వుడా కాలనీ లో డాక్టర్ సాయి సుధీర్, సత్యవాణి దంపతులు.. తమ కొడుకుతోపాటు నివాసం ఉంటున్నారు. 2009 లో డాక్టర్ సాయి సుధీర్‌తో సత్యవాణికి వివాహం జరిగింది. సత్యవాణి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అసిస్టెంట్ నెఫ్రాలజిస్ట్‎గా డాక్టర్ సాయి సుధీర్ విశాఖలోని రెండు వేర్వేరు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాడు. అయితే గత కొంతకాలంగా డ్యూటీకి వెళ్లడం లేదు. తరచూ భార్యతో గొడవ పడుతూ ఆమెను వేధిస్తుండేవాడు. జూదంకు అలవాటు పడి డాక్టర్ సుధీర్ 70 లక్షల రూపాయల వరకు అప్పుల పాలైనట్టు గుర్తించిన భార్య అతడ్ని ప్రశ్నించింది. దీంతో ఆ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అప్పులు తీర్చేందుకు నిత్యం సత్యవాణిని డబ్బుల కోసం వేధించేవాడు. భర్త వేధింపులు తాళ లేక.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది సత్యవాణి.

బంధువులకు సమాచారం ఇచ్చి పరారీ.. సత్యవాణి ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. డాక్టర్ సాయి సుధీర్ పారిపోయాడు. సత్యవాణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు. సత్యవాణి అత్తమామలు కూడా గత రెండు మూడు రోజులుగా సత్యవాణి ఉంటున్న ఇంట్లో ఉంటూ వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ సాయి సుధీర్ పై కేసు.. మృతరాలి తండ్రి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ వేధింపులకు భార్య ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు డాక్టర్ సాయి సుధీర్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు సత్యవాణి అత్తమామలు, జూదం క్యాసినోకు అలవాటు పడిన డాక్టర్ సాయి సుధీర్ అప్పుల పాలై భార్యను వేధించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పీఎం పాలెం సిఐ రామకృష్ణ వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..