Andhra Pradesh: ఇంజినీరింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం.. వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి సూసైడ్..
చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాల్సిన ఆ విద్యా కుసుమం ర్యాగింగ్ భూతానికి బలైపోయింది. ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులను నట్టేట ముంచేసింది. సహచర విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులు..
చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాల్సిన ఆ విద్యా కుసుమం ర్యాగింగ్ భూతానికి బలైపోయింది. ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులను నట్టేట ముంచేసింది. సహచర విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులు భరించలేక నిండు జీవితాన్ని ముగించేశాడు ఓ స్టూడెండ్. నెల్లూరు జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది. కడనూతల ఆర్ఎశ్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. వేధింపులు భరించలేక రైలు కిందపడి విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన రూమ్‌మేట్స్ వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పిన ప్రదీప్.. కావలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజ్ కు చేరుకున్నారు. ప్రదీప్‌ను ర్యాగింగ్ చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా.. ప్రదీప్ స్వగ్రామం అనంతసాగర్ మండలం శంకర్‌నగర్.
తరగతిలోని విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల బయటి వారు కూడా మా వాడిపై ఒత్తిడి తెచ్చేవారు. బీర్లు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేవారు. డబ్బుల్లేవంటే ఫోన్ ఇవ్వాలని దౌర్జన్యం చేసేవారు. మేం కళాశాలకు వచ్చి మాట్లాడతామంటే వేధింపులు ఇంకా ఎక్కువవుతాయని వద్దన్నాడు. టీసీ ఇచ్చేయండి.. వేరేచోటికి వెళ్లి చదువుకుంటానని యాజమాన్యాన్ని తను అడిగినా వారు పట్టించుకోలేదు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయిందని ప్రదీప్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..