Andhra Pradesh: మృత్యుంజయ హోం చేయాలి.. చందాలు ఇవ్వండి. ఎస్.కే యూనివర్సిటీ వీసీ సంచలన నిర్ణయం.

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే) వీసీ తీసుకున్న వింత నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్యాంపస్‌లో హోమం చేయాలని వీసీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో వసూలు చేయాలని డిసైడ్‌ అయ్యారు...

Andhra Pradesh: మృత్యుంజయ హోం చేయాలి.. చందాలు ఇవ్వండి. ఎస్.కే యూనివర్సిటీ వీసీ సంచలన నిర్ణయం.
SK University
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2023 | 9:53 AM

అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కే) వీసీ తీసుకున్న వింత నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్యాంపస్‌లో హోమం చేయాలని వీసీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో వసూలు చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే ఉద్యోగులకు సర్క్యులర్‌ జారీ చేశారు. టీచింగ్‌ స్టాఫ్‌ 500 రూపాయలు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 100 రూపాయలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. వీలైతే అంతకంటే ఎక్కువే ఇవ్వాలని వీసీ తెలిపారు. చందాల వసూళ్ల కోసం ఏకంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నే నియమించడం గమనార్హం. ఇంతకీ క్యాంపస్‌లో హోమం నిర్వహించాల్సిన అవసరం ఏంటనేగా మీ సందేహం.

వివరాల్లోకి వెళితే.. ఎస్కే యూనివర్సిటీలో ఇటీవల వరుస మరణాలు సంభవించాయి. గడిచిన కొన్నాళ్లలో వివిధ కారణాలతో 25మంది సిబ్బంది మృతి చెందారు. దీంతో ఈ విషయంలో వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల అకాల మరణాలతో మృత్యుంజయ హోమం నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగానే మృత్యుంజయ హోమం, శాంతి హోమం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చందాలు ఇవ్వాలని సర్క్యూలర్‌ జారీ చేశారు.

తప్పుపడుతోన్న విద్యార్థి సంఘాలు..

ఇదిలా ఉంటే ఎస్.కె యూనివర్సిటీలో తలపెట్టిన మృత్యుంజయ హోమం పై విద్యార్థి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీలో కులాలు, మతాలుగా విడదీసే విధంగా ఈ మృత్యుంజయ హోమాలు చేయడం కరెక్ట్ కాదని… వెంటనే ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్టార్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజంగా మృత్యుంజయ హోమం లాంటి కార్యక్రమాలు చేదల్చుకుంటే యూనివర్సిటీకి బయట చేయాలని…. యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడకుండా కులాలు, మతాల ప్రాతిపదిగిన హోమాలు చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఎస్కే యూనివర్సిటీ తలపెట్టిన మృత్యుంజయ హోమం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని…. లేదంటే మృత్యుంజయహోమాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో