AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: ఈ బంగారు తల్లి.. అన్న ఎక్కిన స్కూల్ బస్సు చక్రం కిందే నలిగిపోయింది

అన్నా సాయంత్రం త్వరగా వచ్చేయ్‌.. మనం ఆడుకుందాం.. అని సోదరుడ్ని స్కూల్ బస్సు ఎక్కిస్తూ ఆ పాప అన్న మాటలే చివరి మాటలవుతాయని ఊహించలేదు. రోజూ మాదిరిగానే అన్నను పాఠశాల బస్సు ఎక్కించేందుకు వచ్చిన చెల్లి.. ఆ బస్సు చక్రాల కిందే పడి నుజ్జునుజ్జయిన తీరు చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...

East Godavari: ఈ బంగారు తల్లి.. అన్న ఎక్కిన స్కూల్ బస్సు చక్రం కిందే నలిగిపోయింది
Hansika
Ram Naramaneni
|

Updated on: Dec 27, 2024 | 7:26 AM

Share

అన్న.. స్కూల్‌కు వెళ్తుంటే.. రోజూ బస్సు వద్దకు వచ్చి బాయ్ చెప్పేది ఆ పాప. కానీ ఆ బస్సే ఆ చిన్నారి పాలిట మృత్యుశకటంలా మారుతుందని తల్లిదండ్రులు ఊహించలేదు. అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన ఆ చిన్నారి.. ఆ బస్సు చక్రాల కిందే నలిగిపోయి విగతజీవిగా మారిపోయింది.  ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలలో వెలుగుచూసింది.

కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామంలో నివశించే కోర్పు నరసయ్యదొర, శైలజ దంపతులకు 5 ఏళ్ల కుమారుడు  గీతాన్స్‌, 3 ఏళ్ల పాప హన్సికాచౌదరి సంతానం. గీతాన్స్‌ కోరుకొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో LKG చదువుతున్నాడు. గురువారం ఉదయం అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటు పాప హన్సిక కూడా వచ్చింది. అయితే పాపను తల్లి శైలజ గమనించలేదు. కుమారుడిని బస్సు ఎక్కించి, ఇంటివైపు బయలుదేరుతుండగా ఒక్కసారిగా చిన్నారి కేకలు విన్పించాయి. ఆమె వెనక్కి తిరిగి చూడగా, తన బిడ్డ హన్సిక బస్సు చక్రాల కిందపడి నలిగిపోతోంది. పరుగుపరుగున దగ్గరికి వెళ్లేసరికే పాప నుజ్జుయ్యింది. ఆ సమయంలో పాప దగ్గర్లో.. ఇయర్‌బడ్స్‌ బాక్స్‌ పడి ఉంది. రోడ్డుపై పడిపోయిన బాక్స్‌ను తీసుకునేందుకు హన్సిక వంగినప్పుడు, బస్సు కదిలి ఫ్రెంట్ టైర్ కింద తల నలిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారి తండ్రి నరసయ్యదొర వైజాగ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. తల్లి గృహిణి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పాప మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. స్కూల్  బస్సు డ్రైవరు వి.నాగరాజును అరెస్టు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..