Andhra: చేపల కోసం వేటకు వెళ్లిన జాలరి.. వలకు చిక్కింది చూసి ఆశ్చర్యం
జలాశయాలు, నదులు, సముద్రాలలో.. అశేష జలచరాలు ఉంటాయి. వాటిలో కొన్ని అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక చేపల్లోనూ అనేక రకాలు సముద్ర, నదీ జలాల్లో జీవిస్తూ ఉంటాయి. జలాశయాల్లోనూ వివిధ రకాల చేపలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి వెండి చేప. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని..

జలాశయాలు, నదులు, సముద్రాలలో.. అశేష జలచరాలు ఉంటాయి. వాటిలో కొన్ని అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక చేపల్లోనూ అనేక రకాలు సముద్ర, నదీ జలాల్లో జీవిస్తూ ఉంటాయి. జలాశయాల్లోనూ వివిధ రకాల చేపలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి వెండి చేప. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులోని ఢిల్లీ మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రం జలాశయంలో ఆ చేప కనిపించింది.
ఇటీవల ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసాయి. జలాశయాల నుంచి భారీగా వరదనీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మాచ్ఐండ్ జలవిద్యుత్తు కేంద్రం దిగువన గిరిజనులకు పెద్దపెద్ద చేపలు లభ్యమవుతున్నాయి. అందులో ఓ గిరిజన జాలరికి పంట పండింది. మిల మిల మెరిసే వెండి చేప వలకు చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 కిలోల చేప అది. దీంతో హుషారుగా మార్కెట్ కు వెళ్లాడు ఆ గిరిజన జాలారి. ఢిల్లీ మార్కెట్కు పది కేజీల బరువు ఉన్న వెండిచేప రావడంతో అంతా ఆసక్తిగా చూశారు.
వాస్తవానికి వెండి చేప శాస్త్రీయ నామం సిల్వర్ కార్ప్ ఫిష్. సిల్వర్ కార్ప్ అనేది సమశీతోష్ణ పరిస్థితులలో 6 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో నివసించే మంచినీటి జాతి. ఈ జాతికి నెమ్మదిగా ప్రవహించే లేదా స్థిరంగా ఉండే నీటిలో పెరుగుతుంది. ఇది పెద్ద నదులనుంచి వేరుపడిన నిల్వ ఉండే సరస్సుల లాంటి వాటిలో, బ్యాక్ వాటర్‌లలో కనిపిస్తుంది. సిల్వర్ ఫిష్‌లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. పాలిసాచ్యురేటెడ్ యాసిడ్స్ ఈ చేపలో లభిస్తాయని మత్స్య శాఖ అధికారులు అంటున్నారు.





