Humanity! డబ్బులు సంపాదిస్తేనే మనిషికి విలువ.. కాళ్ళు పడిపోయిన కొడుకుని ఇంటి నుంచి గెంటేసిన తండ్రి..
ఇది కలియుగం.. దయ, జాలి, న్యాయం, అన్యాయం అనే మాటలకు చోటు లేదు అని కొంతమంది నిరుపిస్తుంటే.. బంధాలు అనుబంధాలన్నీ వ్యాపర బంధాలే అని మరికొందరు నిరూపిస్తున్నారు. డబ్బు ఉంటే.. ఊరంతా చుట్టాలే.. డబ్బులు లేని రోజున కన్న తల్లిదండ్రులకు కూడా బిడ్డలు కాని వారే.. ఇందుకు సజీవ సాక్ష్యంగా ఒక సంఘటన నిలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిన కొడుక్కి అన్నీ తానె అండగా నిలబడాల్సిన తండ్రి.. తన కొడుకు ఇక డబ్బులు సంపాదించలేడని తెలియడంతో ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు.. ఆ మాటలు నిజం అంటూ నేటి సమాజంలోని మనుషులు నిరూపిస్తున్నారు. డబ్బులు ఉంటే ఈ సమాజంలో విలువ గౌరవం.. అంతేకాదు కన్న తల్లిదండ్రులు కూడా సంపాదించే బిడ్డల పట్ల స్పెషల్ కేరింగ్ చూపిస్తారు. లేదంటే కడుపున పుట్టిన బిడ్డలను సైతం తమకు ఏమీ కానివరుగా భావిస్తున్నారు. అవును అన్నీ బాగుండి.. డబ్బులు ఉంటేనే తండ్రి సోదరులు గౌరవిస్తారు. ప్రేమిస్తారనే దానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఒక సంఘటన
కొడుక్కి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయి కష్టాల్లో ఉన్నాడు., మేము నీకున్నాం.. అంటూ దైర్యం చెప్పాల్సిన తండ్రి, సోదరుడు బాధితుడిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దిక్కు తోచని స్థితిలో వీల్ చైర్లో ఇంటి బయటే అనాథలా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఇరుగు పొరుగు అయ్యో పాపం అన్నారు. చలించిపోయారు. తాను సింగపూర్ లో ఉద్యోగం చేసి డబ్బులు పంపినంత కాలం.. ఇంట్లో అంతా బాగానే ఉన్నారని, .. ఇప్పుడు తనకు యాక్సిడెంట్ అయ్యి.. వైద్యం కోసం డబ్బులు సాయం చేయమని అడిగినందుకు ఇలా ఇంటి నుంచి గెంటేశారని వాపోయాడు. ఈ ఘటన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వేల్పూరు గ్రామంలో తండ్రి నాగేశ్వరరావు నివసిస్తున్నాడు. ఇతనికి నాగత్రినాథ్ , నాగ రాజ్ కిరణ్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు నాగత్రినాథ్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2018లో సింగపూర్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడకు వెళ్ళిన కొత్తలోనే తల్లి మరణించింది. తల్లి అంత్యక్రియలు తర్వాత మళ్ళీ సింగపూర్ కు వెళ్లి ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి ఇంటికి ప్రతినెలా రూ.60 వేలు తండ్రి, తమ్ముడు అకౌంట్స్ కు పంపేవాడు.
2024 జూలై లో సింగపూర్ నుంచి ఇంటికి వచ్చాడు. తమ్ముడికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి.. తనకు ముందు పెళ్లి చేయమని అడిగాడు. ఇంతలో సింగపూర్ లో మళ్లీ ఉద్యోగం వచ్చింది. ఇంతలో దురదృష్టం త్రినాధ్ ని వెంటాడింది. డిసెంబర్ 31న బైక్ మీద నుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో నడుముకి గాయమై రెండు కాళ్ళు చచ్చుబడ్డాయి.
వైజాగ్ లోని ఓ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం అడ్మిట్ అయ్యాడు. మొత్తం రూ.6 లక్షలు ట్రీట్మెంట్ కి కావాలని చెప్పారు. త్రినాధ్ వద్ద ఉన్న 4 లక్షల రూపాయలను చికిత్స ఇచ్చాడు. మరో రూ.2 లక్షలు కడితేనే చికిత్స ఇస్తామని చెప్పడంతో… ఇంటికి వచ్చాడు. అయితే త్రినాధ్ ను ఇంట్లోకి రాకుండా తండ్రి, తమ్ముడు అడ్డుకున్నారు. దీంతో త్రినాథ్ ఇంటి బయటే వీల్ చైర్ లో ఉండిపోయాడు. తాను సంపాదించి డబ్బులు పంపినంత కాలం అంతా బాగుందని.. ఇప్పుడు తనకు కష్టం వస్తే కనీసం తండ్రి కూడా చేరదీయడం లేదంటి కంట కనీరు పెట్టుకున్నాడు. ఇది చూసి చూపరుల మనసు ద్రవించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








