PM Modi: అమెరికాలో ప్రధాని మోదీ బస చేసింది ఇదే హోటల్‌లో.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..!

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మూడు రోజుల పర్యనటను ముగించుకుని భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మోదీ పర్యటన సందర్భంగా..

PM Modi: అమెరికాలో ప్రధాని మోదీ బస చేసింది ఇదే హోటల్‌లో.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Sep 27, 2021 | 8:51 AM

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మూడు రోజుల పర్యనటను ముగించుకుని భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మోదీ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని ఆండ్రూస్ జాయింట్ ఎయిర్‌ఫోర్స్ బేస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న భారతీయులు.. ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రధాని మోదీకి ఇది రెండో విదేశీ పర్యటన. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా ప్రధాని మోదీ అగ్రరాజ్యాన్ని సందర్శించారు. మోదీ పర్యటనకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిస్తే..

అమెరికా పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన హోటల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ వాషింగ్టన్‌ డీసీలోని బిలార్డ్ హోటల్‌లో బస చేశారు. దీనిని 204ఏళ్ల క్రితం.. అంటే 1816లో నిర్మించారు. ఆ తర్వాత ఈ హోటల్‌లో ఎన్నో మార్పులు చేశారు. ఈ హోటల్‌లో మొత్తం 9 సూట్లు ఉన్నాయి. వీటిలో క‌నీసం ఐదింట్లో దేశాధినేత‌లు అమెరికా పర్యటనకు వ‌చ్చిన‌ప్పుడు బ‌స చేస్తుంటారు. అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్‌ పేర్ల మీద కూడా ఇందులో సూట్లు ఉన్నాయి. ఇందులో బస చేయాలంటే.. కొన్ని నెలల ముందుగానే బక్ చేసుకోవాల్సి ఉంటంది. అమెరికా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ హోటల్‌లోని ఇంటీరియల్ ఉంటుంది.

Modi Hotel

హోటల్‌ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత:

కాగా, ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ సమావేశం సందర్భంగా స్నిఫ్ఫర్ డాగ్స్‌తో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని.. తొలి రోజు బిజీ బిజీగా గడిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఐదు కంపెనీల సీఈఓలతో మోదీ విడివిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మోదీతో సమావేశమైన వారిలో శంతను నారాయణ్, వివేక్‌లాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ భారతీయ అమెరికన్లు కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ బస చేయడంతో ఈ హోటల్ గురించి ఒక్కసారిగా నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ హోటల్ పేరు ఇపుడు మార్మోగిపోతోంది.

ఇవీ కూడా చదవండి:

PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: బడలిక ఎరుగని ప్రధాని మోడీ.. అలసట దరిచేరక పోవడానికి రహస్యం ఇదే!