Plane Crash: వర్జీనియాలో కుప్పకూలిన మరో విమానం.. 10 రోజుల్లో ఇది రెండో ప్రమాదం.. ప్రమాదంలో ముగ్గురు మృతి..

అమెరికాలో మరో విమానం కుప్పకూలింది. గత 10 రోజుల్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. వర్జీనియావాసులుగా గుర్తించారు.

Plane Crash: వర్జీనియాలో కుప్పకూలిన మరో విమానం.. 10 రోజుల్లో ఇది రెండో ప్రమాదం.. ప్రమాదంలో ముగ్గురు మృతి..
Plane Crash
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 27, 2021 | 10:14 AM

అమెరికాలో మరో విమానం కుప్పకూలింది. గత 10 రోజుల్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. నైరుతి వర్జీనియాలో ఆదివారం ఒక చిన్న విమానం కూలిపోవడంతో వర్జీనియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కాని అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అప్పటికే చనిపోయినట్లుగా వారు తెలిపారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో ఫాయెట్‌విల్లేలోని ఫాయెట్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన తర్వాత సింగిల్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ C23 క్రాష్ అయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఒక ప్రకటనలో తెలిపింది.

విమానం లోపల మృతదేహాలు 

చార్లెస్టన్‌కు ఆగ్నేయంగా 50 మైళ్ల (80 కిలోమీటర్లు) దూరంలో ఉన్న లాన్సింగ్ గ్రామీణ ప్రాంతంలోని కంచె దగ్గర విమానం శిథిలాలు కనుగొనబడినట్లు స్టేట్ పోలీస్ కెప్టెన్ ఆర్‌ఏ మాడీ తెలిపారు. మృతదేహాలు విమానం లోపల గుర్తించారు. మృతులను నిక్ ఫ్లెచర్ (38), మైఖేల్ ట్యాప్‌హౌస్ (36)  వెస్లీ ఫార్లే (39) గా రాష్ట్ర పోలీసులు గుర్తించారు. వీరంతా వర్జీనియాలోని చెసాపీక్ ప్రాంతానికి చెందినవారు. FAA నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది.

రెండు వారాల క్రితం అలాంటి ప్రమాదం

రెండు వారాల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. లేసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామీణ ప్రాంతమైన లేసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రదేశం న్యూ రివర్ జార్జ్ బ్రిడ్జ్ నుండి 80 కి.మీ. విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.  ప్రమాదం జరిగిన సమయంలో  విమానం రన్‌వే ఎడమ వైపుకు తిరిగింది. ఆ తర్వాత ఆ విమానం కూలిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం  వర్జీనియా రన్ వే చిన్న విమానాలకు తగినదని తేల్చారు. చాలా సార్లు ఈ రన్‌వేపై ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..