PM Narendra Modi: బడలిక ఎరుగని ప్రధాని మోడీ.. అలసట దరిచేరక పోవడానికి రహస్యం ఇదే!

Narendra Modi keep jetlag away during foreign trips: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఏ మాత్రం అలసిపోకుండా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఏకధాటిగా

PM Narendra Modi: బడలిక ఎరుగని ప్రధాని మోడీ.. అలసట దరిచేరక పోవడానికి రహస్యం ఇదే!
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 26, 2021 | 10:21 PM

Narendra Modi keep jetlag away during foreign trips: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఏ మాత్రం అలసిపోకుండా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఏకధాటిగా కొన్ని గంటలపాటు ప్రయాణం చేసినా.. వరుసగా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినా ప్రధాని మోదీ అలసటను మాత్రం దరిచేరనియరు. అందుకే ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారని  అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలలో.. బిజీ షెడ్యూల్‌ ఉన్నా.. ఆయన అలసటను మాత్రం దరిచేరనీయరు. జెట్‌లాగ్‌ను దూరంగా ఉంచడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వీటి గురించి తెలుసుకొని ఆయన అభిమానులు.. ఫిదా అవుతున్నారు.

అలసట ( జెట్‌లాగ్‌) గురించి పెద్దగా ఆలోచించకుండా ఉండటానికి ప్రధాని మోదీ బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహిస్తారని.. ఇలా ఆయన అలసటకు చెక్ పెడతారని ఆయనతో ఉన్న అధికారులు చెబుతారు. నరేంద్ర మోడీ తన మూడు రోజుల అమెరికా పర్యటన అనంతరం ఆదివారం తిరిగి భారత్ కు వచ్చారు. అయిప్పటికీ ఆయనలో అలసటగా మాత్రం కనిపించలేదు. ఇలా అలసటను అదుపులో ఉంచుకుని అధిక వేగంతో ప్రయాణించడం ఆయనకు కొత్తకాదు. ఆయన 1990 లలో యుఎస్‌ని సందర్శించినప్పుడు కూడా  ఎయిర్‌లైన్స్ భారీ రాయితీతో నెలవారీ ట్రావెల్ పాస్‌ని ఇచ్చేది. దాని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి మోడీ ఎప్పుడూ రాత్రివేళ ప్రయాణం చేసేవారు. దీనివల్ల హోటళ్ల కోసం పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఎందుకంటే.. రాత్రివేళ విమానాశ్రయంలో, ఆ తర్వాత విమానంలో గడుపవచ్చు.. అలా మోదీజీకి జెట్ లాగ్ దరిచేరే అవకాశం లేకుండా పోయింది.

ప్రధాని మోదీ విమానంలో అడుగుపెట్టిన వెంటనే.. తన సమయానికి అనుగుణంగా నిద్రపోతారు. దీంతోపాటు టేకాఫ్ అయ్యే క్రమంలో.. దేశానికి వచ్చే సమయంలో మోదీ నిద్రపోరు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారతీయ కాలమానం ప్రకారం నిద్రపోతారని అధికారులు చెబుతారు. అయితే.. విమానంలోని గాలి శరీరంలోని తేమను పీల్చుకుంటుంది అందువల్ల మోదీ నీరు ఎక్కువగా తాగుతారు.  కాగా.. ప్రధాని మోదీ అమెరికాలో గడిపిన సుమారు 65 గంటల సమయంలో 20 సమావేశాలకు హాజరయ్యారు. ఆయన మూడు రోజుల అమెరికా పర్యటన మొత్తం సమావేశాలతో నిండిపోయింది. దీంతోపాటు ప్రధాని మోదీ విమానంలో తిరిగి వచ్చే క్రమంలో అధికారులతో నాలుగుసార్లు సుదీర్ఘ సమావేశాలు కూడా నిర్వహించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read:

Punjab New Cabinet: పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో చేరిన 15 మంది!

Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ 3 కారణాల వల్ల బరువు పెరుగుతారు..! ఏంటో తెలుసుకోండి..

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.