Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఈ 3 కారణాల వల్ల బరువు పెరుగుతారు..! ఏంటో తెలుసుకోండి..
Diabetes: డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
Diabetes: మారుతున్న జీవన శైలి కారణంగా మన శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటిస్. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే పరిస్థితిని డయాబెటిస్ అంటారు ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మూడు సమస్యల కారణంగా విపరీతంగా బరువు పెరుగుతారు. వాటి గురించి తెలుసుకుందాం.
1.ఇన్సులిన్ నిరోధకత కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల డయాబెటీస్ పేషెంట్లు బరువు పెరుగుతారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులలో శరీరం ఇన్సులిన్ చర్యను నిరోధిస్తుంది. తద్వారా ఇన్సులిన్ రక్తం నుంచి గ్లూకోజ్‌ను తొలగించడంలో అంతగా ప్రభావం చూపదు. అందువల్ల కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెంచుతాయి. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు బరువు తగ్గడం కష్టమవుతుంది.
2. అన్ని సమయాలలో ఆకలి అనుభూతి డయాబెటీస్‌తో బాధపడుతున్న వ్యక్తులు అన్ని సమయాలలో ఆకలిని కలిగి ఉంటారు. ఈ కారణంగా అధికంగా తింటారు. దీనివల్ల రక్తంతో చక్కెర స్థాయిలు పెరిగి బరువు పెరుగుతారు. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కొద్ది సేపటికి రక్తంలో ఈ ప్రభావం తగ్గినా మళ్లీ ఆకలిని ప్రేరేపిస్తుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు రోజులో ఎక్కువసార్లు తింటారు.
3. డయాబెటిస్ మెడిసిన్ ఇన్సులిన్ కొవ్వును నిల్వ చేయడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ చికిత్సకు ఇన్సులిన్ తీసుకోవడం కూడా కొంత బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాదు డయాబెటీస్‌కి వాడే కొన్ని మందులు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. తద్వారా బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉత్తమ మార్గం కార్బోహైడ్రేట్ తీసుకోకవడం. అంతేకాదు వీరు వైద్యులు సూచించిన డైట్ ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడే బరువు నియంత్రణలో ఉంటుంది.