PM Modi: నేడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. పైలట్ దశలో ఆరు కేంద్ర ప్రాంతాలు ఎంపిక

Ayushman Bharat Digital Mission: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని..

PM Modi: నేడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. పైలట్ దశలో ఆరు కేంద్ర ప్రాంతాలు ఎంపిక
Pm Modi
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 1:26 PM

Ayushman Bharat Digital Mission: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట  నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం..  ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో నిక్లిప్తం చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా  ప్రస్తుతం 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్  నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ ,  డామన్- డయు, లడఖ్, లక్షద్వీప్ – పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేయనున్నారు.

ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా భవిష్యత్తులో ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడి..  చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా  వెంటనే ఈ  డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్ గా ఆ రోగి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేల కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది.

Also Read:

 నవరాత్రి మొదటి రోజునుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం.. కరోనా నిబంధనలు పాటిస్తూ ‘మహాసమాధి’ దర్శనానికి అనుమతులు