Maharastra: నవరాత్రి మొదటి రోజునుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం.. కరోనా నిబంధనలతో ‘మహాసమాధి’ దర్శనానికి అనుమతి

Maharastra Temples: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది.  దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేసింది...

Maharastra: నవరాత్రి మొదటి రోజునుంచి తెరుచుకోనున్న షిరిడీ ఆలయం.. కరోనా నిబంధనలతో 'మహాసమాధి' దర్శనానికి అనుమతి
Shirdi Saibaba
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 6:55 AM

Maharastra Temples: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది.  దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. ప్రజలకు ఆంక్షలతో కూడిన అనుమతులను ఇచ్చింది. ఇక పాఠశాలలు, షాపింగ్ మాల్స్ ప్రజలు రద్దీ ఉండే ప్రదేశాలపై ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలను కూడా మూసివేశారు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడేవరకూ షిరిడీ సాయి బాబా ఆలయాన్ని కూడా మూసివేస్తున్నామని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు ఏప్రిల్ 5వ తేదీన ప్రకటించారు. అప్పటి నుంచి షిరిడీ బాబా ఆలయంలో భక్తులకు అనుమతి లేదు.

తాజాగా దేశ వ్యాప్తంగానే కాదు.. మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ ఉధృతి అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలను సడలిస్తూ.. పరిమితులతో కూడిన అనుమతులను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయాలు తెరచుకుంటున్నాయి. ఇక షిరిడీ సాయినాథుడిని ఆలయం కూడా త్వరలో తెరవడానికి ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. దీంతో సాయినాథుడు దసరా నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకుని భక్తులను దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7వ తేదీనుంచి షిర్డీ సాయిని దర్శించుకోవడానికి అనుమతులను ఇచ్చింది అక్కడ ప్రభుత్వం. నవరాత్రి మొదటి రోజు నుంచి .. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు ఆలయాలను దర్శించుకోవచ్చునని తెలిపింది.  దీంతో షిర్డీ సాయి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది విజయదశమి రోజున షిర్డీకి చాలా భక్తులు దర్శించుకుంటారు. 103 ఏళ్ల క్రితం ఆ సాయినాథుడు దసరా రోజునే మహాసమాధి చెందారని భక్తుల నమ్మకం.. దీంతో విజయదశమి రోజున షిరిడీలోని సాయి సమాధిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరతారు. ఆరోజు సాయి సమాధిని దర్శించుకోవడం పుణ్యఫలమని భక్తుల నమ్మకం.

Also Read:

 పాకిస్థాన్‌లో త్రేతాయుగం, ద్వాపర యుగం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.