శ్రీవారిని దర్శించుకున్న దిల్‏రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..

కరోనా కేసులు తగ్గడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే ఇటు థియేటర్లు ఓపెన్ అయి... చిత్రాలు సూపర్ హిట్స్ అందుకోవడంతో ..

శ్రీవారిని దర్శించుకున్న దిల్‏రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..
Dil Raju
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2021 | 10:17 AM

కరోనా కేసులు తగ్గడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే ఇటు థియేటర్లు ఓపెన్ అయి… చిత్రాలు సూపర్ హిట్స్ అందుకోవడంతో .. పలువురు సినీ ప్రముఖులు సైతం దైవదర్శనాలకు క్యూ కట్టారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు వెళ్తున్నారు. ఇటీవల.. సమంత, ఉపాసన, మంచు లక్ష్మి, మంచు మనోజ్ వంటి సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోన్నట్టు తెలుస్తోంది.

Nayan

ఇదిలా ఉంటే..మరోవైపు.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా.. తన ప్రియుడు విఘ్నేష్ శివన్‏తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక దిల్ రాజు.. వంశీ పైడిపల్లి తొలిసారి తమిళ హీరో విజయ్‏తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. దిల్ రాజు, వంశీ పైడిపల్లి, విజయ్ ముగ్గురూ కలిసి ఉన్న పిక్ రిలీజ్ చేస్తూ అస‌లు విష‌యం చెప్పారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలో ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుంది.మేకర్స్ త్వరలో హీరోయిన్, ఇతర తారాగణం, సిబ్బంది వివరాలను ప్రకటించనున్నారు.

ఇక గత కొద్దిరోజులుగా.. నయన్, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. తమిళ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గోన్న నయన్.. తన వేలికి ఉన్న రింగ్ చూపిస్తూ.. స్పెషల్ అంటూ.. నిశ్చితార్థం అయిన విషయాన్ని బయటపెట్టేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ఇటీవల వీరిద్దరూ కలసి కెమెరా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read: R.R.Venkat: ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత కన్నుమూత… విషాదంలో చిత్రపరిశ్రమ..

Bigg Boss 5 Telugu: అలా ఉండటమే లహరి కొంపముంచిందా ? అర్జున్ రెడ్డి భామ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఇవే…

Kareena Kapoor: ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా..! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?