Bigg Boss 5 Telugu: అలా ఉండటమే లహరి కొంపముంచిందా ? అర్జున్ రెడ్డి భామ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఇవే…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 27, 2021 | 8:21 AM

బిగ్‏బాస్ సీజన్ 5.. మూడవ వారం ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‏తో ఘనంగా ప్రారంభమైన ఈ షో..

Bigg Boss 5 Telugu: అలా ఉండటమే లహరి కొంపముంచిందా ? అర్జున్ రెడ్డి భామ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఇవే...
Lahari Bb

బిగ్‏బాస్ సీజన్ 5.. మూడవ వారం ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‏తో ఘనంగా ప్రారంభమైన ఈ షో.. నాలుగవ వారంలోకి ఎంటర్ అయ్యింది. మొదటి వారం సరయు ఇంటి నుంచి బయటకు రాగా.. రెండవ వారం.. ఉమాదేవి.. మూడవ వారం లహరి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్స్ అనూహ్యంగా చిన్న చిన్న కారణాలతోనే.. స్ట్రాంగ్ గా ఉండే సభ్యులు ఎలిమినేట్ అయ్యారంటూ నెటిజన్లు వాదిస్తున్నారు. ఇక నిన్న ఇంటి నుంచి బయటకు వచ్చిన లహరి కూడా రవి, ప్రియ మొదలు పెట్టిన రచ్చ కారణంగానే బలి అయ్యిందనేది మరో వాదన.

లహరి.. తనకు నచ్చినట్టుగానే ఉంటూ ఇతరుల గురించి ఎక్కువగా పట్టించుకోదు. అలాగే తనకు సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోయినా.. ఇతరుల నుంచి రెస్పెక్ట్ రాకపోయిన ఆగ్రహంతో ఊగిపోతుంటుంది. లహరికి తనపై తనకు నమ్మకం ఎక్కువే. అలాగే ఆవేశం కూడా ఎక్కువే. బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లినప్పటినుంచి చీటికీ మాటికీ ఇతర కంటెస్టెంట్స్ తో గొడవలు పెట్టుకుంటూ మొదట్లోనే బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. అలాగే ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి కాజల్‏తో లహరికి అంతగా పడేది కాదు. కంటెంట్ కోసమే కాజల్ అలా ప్రవర్తిస్తుందని ఆవేశంతో ఊగిపోయిన లహరి.. ఆ తర్వాత తనకు హమీద సరిగ్గా మాట్లాడడం లేదంటూ గొడవ పెట్టేసుకుంది. దీంతో మొదట్లోనే లహరిపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది ప్రేక్షకులకు. ఇవే కాకుండా.. లహరి ఎలిమినేట్ కావడానికి మరికొన్ని కారణాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది.

1. బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి లహరి ఇతరుల తీరుపై చిరాకు పడుతూ.. అరుస్తూ.. గొడవలు పెట్టుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కాజల్, హమీదతో జరిగిన గొడవలతో లహరిపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అలాగే తనకు నచ్చినట్టు తనుంటూ.. ముక్కుసుటిగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే.. కొన్ని సందర్భాల్లో ఆమె ప్రతి కయ్యానికి కాలు దువ్వడం ప్రధానంగా ఆమె ఎలిమినేట్ కావడానికి కారణమని చెప్పుకొవచ్చు. 2. ఇక ఇంట్లో ఉన్న కొందరికి లహరి అంటే అస్సలు పడదు. దీంతో ఆమె ఎవరితో ఉన్నా..వాళ్లకు తన గురించి వ్యతిరేకంగా చెప్పేవారు.. తనతో జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. ఇవే కాకుండా.. తన డ్రెస్సింగ్ బాగుండదు అంటూ కంటెస్టెంట్స్ చెప్పుకోవడం కూడా మరొకటి. 3. ఇక బయటకు వచ్చిన ఉమాదేవి సైతం .. లహరి బిగ్‏బాస్ ఇంట్లో ఉండడం వేస్ట్ అని చెప్పేసింది. ఇప్పటివరకు లహరి ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్ టైన్ చేయలేదు. పైగా తరుచూ గొడవలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. 4. ఇక గత సోమవారం ప్రియ, రవి మాట్లాడిన మాటల కారణంగా లహరి గురించి పూర్తిగా ప్రేక్షకులలో నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. తన అవసరాల కోసమే ఇంట్లో అబ్బాయిలతో చనువుగా మాట్లాడుతుందనే సందేహాలను రవి మాటలతో అర్థమైంది. అలాగే రవి, లహరి.. అర్థరాత్రి బాత్ రూం దగ్గర హగ్గులు అంటూ ప్రియ చేసిన కామెంట్స్ లహరి ఎలిమినేషన్‏కు ప్రధాన కారణమని చెప్పుకొచ్చు. మరోవైపు.. వారిద్దరి చేసిన రచ్చతో లహరి బలయ్యిందంటూ సానుభూతి వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. 5. ఇవి కాకుండా బిగ్‌బాస్‌ త్వరలో ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నాడని, అందుకే లహరిని ఎలిమినేట్‌ చేసి ఆ స్థానాన్ని వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌తో భర్తీ చేసే ప్లాన్‌లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి లహరి ఆవేశం.. ప్రియ, రవి.. లహరి గురించి వ్యాఖ్యలు కూడా ఆమె ఎలిమినేషన్ కావడానికి కారణాలని చెప్పుకొచ్చు.

Also Read: Aishwarya Rajesh: క్యారెక్టర్‏కు మాత్రమే ప్రాధాన్యత.. గ్లామర్ పాత్రలు అస్సలు చేయను.. తెలుగమ్మాయి ఆసక్తికర వ్యాఖ్యలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu