Bigg Boss 5 Telugu: మరోసారి అసలు విషయం బయటపెట్టిన లహరి.. అల అనకండి అంటూ షణ్ముఖ్ ఫైర్..

బిగ్‏బాస్ సండే ఫన్ డే గా మార్చేశాడు కింగ్ నాగార్జున. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి లెహరాయి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన నాగ్..

Bigg Boss 5 Telugu: మరోసారి అసలు విషయం బయటపెట్టిన లహరి.. అల అనకండి అంటూ షణ్ముఖ్ ఫైర్..
Shanmukh
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2021 | 7:40 AM

బిగ్‏బాస్ సండే ఫన్ డే గా మార్చేశాడు కింగ్ నాగార్జున. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి లెహరాయి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆ తర్వాత స్పాటి పై సాంగ్ అనే ఆట ఆడించాడు. ఇక రావడంతోనే దేవతలా ఉన్నావ్..హాట్‏గా ఉన్నావ్ అంటూ హమీదపై పొగడ్తల వర్షం కురింపించాడు. దీంతో రెచ్చిపోయిన బ్యూటీ.. కొత్తగా ఏదైనా చెప్పాలంటూ నాగార్జునకే కౌంటర్ వేసింది. ఇక ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో ఇంటి సభ్యులను రెండు టీంలుగా విభంజించి.. పాటలు మధ్యలో ఆపడం, బజర్ కొట్టడం, కొట్టిన వాళ్లు పాటను పూర్తిగా పాడాలి. ఆ తరువాత ఆ పాట వచ్చినప్పుడు ఏ కంటెస్టెంట్ గుర్తుకు వచ్చారో.. చెప్పాలి. వారితో డ్యాన్స్ చేయించాడు.

ఇందులో సిరి, లహరి ముందుగా రాగా.. ఆ తర్వాత.. జెస్సీ, హమీద.. విశ్వ, శ్వేత.. సన్నీ, ప్రియాంక.. మానస్, కాజల్… షన్ను, రవి.. నటరాజ్ మాస్టర్, ప్రియ.. యానీ మాస్టర్, లోబో కలిసి వచ్చారు. ఇక ఆతర్వాత కాసేపు ఉత్కంఠను కలిగించి లహరి ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు నాగ్. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన లహరిని.. ఫెయిల్యూర్ కంటెస్టెంట్స్ ఎవరనేది చెప్పాలని లహరిని అడగ్గా అందరి గురించి చెబుతాను అంటూ చెప్పేసింది. రవి, కాజల్‏కు కెమెరాలు ఉన్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది. ఇక ఆతర్వాత తను లేకపోయినా శ్వేత స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత చిన్న నిర్ణయాలే పెద్ద పెద్ద ప్రభావాన్ని చూపుతాయని, సిరి నామినేట్ చేసిందని నువ్ నన్ను చేసేశావ్.. ఏంట్రా షన్ను అంటూ ప్రశ్నించింది. సిరి చెప్పిందల్లా చేయకు.. ఆమెను ఫాలో అవ్వకు అంటూ షన్నుకు సలహాలు ఇచ్చింది. తాను చేసిందని నేను చేయలేదు.. అని షన్ను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక సిరి సైతం చెప్పింది. కానీ లహరి మాత్రం వినలేదు. సిరి షన్ను కలిసే ఆడుతున్నారన్నట్టుగా లహరి చెప్పుకొచ్చింది. దీంతో.. మీరు అలా ఆలోచించడం రాంగ్ అని.. పదే పదే ఆ మాట అనకండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు షణ్ముఖ్.

ఇక ఆ తర్వాత.. స్సీ తమ్ముడు లాంటి వాడు. ఎవ్వరో ఒకరిని ఫాలో అవుదామని చూస్తున్నాడు. కానీ ఎవరినీ ఫాలో అవ్వాలో తెలియడం లేదని తెలిపింది. సన్నీ అయితే చాలా సెన్సిటివ్.. షార్ప్ అని అనుకుంటాడు.. కానీ అంత కాదు అని కౌంటర్ వేసింది. మానస్ గురించి ఇంకా ఏం తెలుసుకోలేదు.. తెలుసుకుందామని అనుకునేలోపు ఇలా బయటకు వచ్చాను అని చెప్పింది.

Also Read: Bigg Boss 5 Telugu: లహరి ఔట్.. ఆ కంటెస్టెంట్‏కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ.. జాగ్రత్త అంటూ చురకలు..

Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్.. హౌస్ నుంచి బయటకు వెళ్లిన లహరి..