Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. ఇప్పటికే ప్రభాస్.. పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు ప్రభాస్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రావణుడి పాత్రలో మరో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ లాంగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవైఅయిదు రోజులపాటు జరుగుతుందని సమాచారం. ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేసినట్లుగా టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది టీం. తెలుగుతోపాటు.. హిందీ, మళయాలం, కన్నడ, తమిళ్ భాషలలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‌లో ప్రభాస్ రాముడిగా.. కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ట్వీట్..
Rebel Star #Prabhas‘s #Adipurush [3D] Releasing Worldwide On 11th August, 2022 in Hindi, Telugu, Tamil, Kannada, Malayalam#Prabhas #SaifAliKhan @omraut @kritisanon @mesunnysingh #BhushanKumar @vfxwaala @rajeshnair06 @RETROPHILES1 @TSeries pic.twitter.com/oNws9sdLYd
— BA Raju’s Team (@baraju_SuperHit) September 27, 2021
Also Read: శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..
R.R.Venkat: ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత కన్నుమూత… విషాదంలో చిత్రపరిశ్రమ..