KGF 2 Movie: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల..

కన్నడ స్టార్ హీరో యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యష్.

KGF 2 Movie: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2021 | 9:10 AM

కన్నడ స్టార్ హీరో యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యష్.. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే అత్యంత విజయాన్ని అందుకున్న భారీ బడ్జెట్ చిత్రంగా కేజీఎఫ్ సినిమా నిలిచింది. ఇక ఈ మూవీ సీక్వెల్‏గా కేజీఎఫ్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీకి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కేజీఎఫ్ 2 పై మరింత క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను.. దేశ వ్యాప్తంగా థియేటర్స్ ఓపెన్ అయ్యాక విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి.. పలు చిత్రాలు సూపర్ హిట్స్ అందుకుంటున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. అలాగే.. కేజీఎఫ్ 2 సినిమా తేదీలో మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అలాగే చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. మరోసారి ఈ మూవీ వాయిదా పడిందంటూ నెట్టింట్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14నే విడుద‌ల చేయ‌బోతున్నట్టు ప్రక‌టించింది… కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ వంటి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ట్వీట్..

Also Read: Bigg Boss 5 Telugu: అలా ఉండటమే లహరి కొంపముంచిందా ? అర్జున్ రెడ్డి భామ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఇవే…

Kareena Kapoor: ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా..! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్

Aishwarya Rajesh: క్యారెక్టర్‏కు మాత్రమే ప్రాధాన్యత.. గ్లామర్ పాత్రలు అస్సలు చేయను.. తెలుగమ్మాయి ఆసక్తికర వ్యాఖ్యలు..