Kareena Kapoor: ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా…! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్

ప్రభాస్ ట్రీట్‌కు కరీనా ఫిదా అయిపోయింది. థ్యాంక్స్ అంటూ ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసింది స్టార్ హీరోయిన్. మరోసారి ప్రభాస్ ట్రీట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Kareena Kapoor: ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా...! 'ది బెస్ట్' అంటూ కరీనా కపూర్ పోస్ట్
Prabhas Treat
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2021 | 2:30 PM

రిలీజ్‌కు మరో ఏడాది మిగిలి ఉండగానే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది ప్రభాస్ ఆదిపురుష్. ఆ సినిమా యూనిట్ ఏం చేసినా.. ట్రెండింగ్‌ క్రియేట్ చేస్తోంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన కో యాక్టర్స్‌కి ఫుడ్‌ పార్టీ ఇస్తుంటాడు. తాజాగా ఆదిపురుష్‌ సినిమాలో రావణ్‌ పాత్రలో నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌కు ఈ పాన్‌ ఇండియా స్టార్‌ బిర్యానీ పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటోను బాలీవుడ్‌ బ్యూటీ, సైఫ్‌ భార్య కరీనా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. బాహుబ‌లి బిర్యానీ పంపించాడంటే అది క‌చ్చితంగా బెస్ట్‌ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు అని బ్యూటీ కామెంట్‌ రాసింది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్‌ లవర్‌ కూడా. తన సోదరి కరిష్మా కపూర్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో కలిసి పుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ప్రభాస్‌ను ద‌గ్గర నుంచి చూసిన వారెవ‌రైనా డార్లింగ్ పిలుస్తారు. సెట్స్‌లో తోటి న‌టీన‌టుల‌ను ఎంతో బాగా ట్రీట్ చేస్తుంటారు. ప్రత్యేకంగా ఇంటి నుంచి వివిధ ర‌కాలైన వంటల‌ను త‌యారు చేసి స‌హ న‌టుల‌కు భోజ‌నం పెడుతుంటారు ప్రభాస్‌. ఆయ‌న‌తో ప‌నిచేసిన హీరోయిన్స్ కొన్ని సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే చెప్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ భార్య, స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ సైతం ప్రభాస్ ట్రీట్‌మెంట్‌కు ఫిదా అయిపోయింది.

Kareena Kapoor

Also Read: నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కానీ

అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్