Andhra Pradesh: నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం… కానీ

బంద్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(సెప్టెంబర్ 27) పాఠశాలలకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది.

Andhra Pradesh: నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... కానీ
Ap Schools
Follow us

|

Updated on: Sep 27, 2021 | 11:07 AM

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(సెప్టెంబర్ 27) పాఠశాలలకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది. సోమవారం నాటి భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు  విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినం ఉంటుందని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

పలు పరీక్షలు వాయిదా…

బంద్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. నేడు నిర్వహించాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రకటించారు. భారత్ బంద్ వల్ల స్టడీ సర్కిల్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. భారత్ బంద్ నేపథ్యంలో నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్  తెలిపారు. ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 27న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారత్‌ బంద్‌కు ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ చేపడుతున్న ఉద్యమంలో అంతా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3  రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పేర్ని నాని కోరారు. ఈ బంద్‌లో ఆర్టీసీ కూడా మధ్యాహ్నం వరకూ పాల్గొననుంది. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్​కు మద్దతిచ్చాయి. బంద్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

Also Read:  అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..