AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Spray: ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రే బరువును తగ్గిస్తుంది.. ఊబకాయాన్ని దీంతో ఎదుర్కోవచ్చు..

ముక్కుతో పీల్చే స్ప్రే ఊబకాయాన్ని తగ్గిస్తుంది. లండన్ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.  స్ప్రేలో ఉండే 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్ ఒక వ్యక్తి అతిగా తినడం గురించి ఆలోచించకుండా నిరోధిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

Nasal Spray: ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రే బరువును తగ్గిస్తుంది.. ఊబకాయాన్ని దీంతో ఎదుర్కోవచ్చు..
Nassal Spray
KVD Varma
|

Updated on: Sep 26, 2021 | 9:29 PM

Share

Nasal Spray: ముక్కుతో పీల్చే స్ప్రే ఊబకాయాన్ని తగ్గిస్తుంది. లండన్ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.  స్ప్రేలో ఉండే ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ ఒక వ్యక్తి అతిగా తినడం గురించి ఆలోచించకుండా నిరోధిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించిన పరిశోధనలో ముక్కులో మానవ నిర్మిత ఆక్సిటోసిన్ స్ప్రే చేయడం వల్ల అనేక సమస్యలకు ఉపశమనం లభిస్తుందని తేలింది. ఉదాహరణకు, ఆటిజంతో బాధపడుతున్న పిల్లల చెవులలో అనేక రకాల శబ్దాలు వినిపిస్తాయి. శాస్త్రీయ భాషలో దీనిని ‘టిన్నిటస్’ అంటారు. ఈ స్ప్రే సహాయంతో, ఇది ఉపశమనం ఇస్తుంది. ఇది కాకుండా, సెక్స్ పట్ల కోరిక తగ్గినప్పుడు ఈ హార్మోన్ స్ప్రే రూపంలో ఇస్తారు. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమైంది.

లండన్లోని ఇంపీరియల్ కాలేజ్, కింగ్‌స్టన్ యూనివర్సిటీ ఇటీవల చేసిన పరిశోధనలో ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుందని వెల్లడించింది. పరిశోధన సమయంలో, ఆహారానికి సంబంధించిన చిత్రాన్ని చూపించే ముందు 40 మంది మహిళలు, పురుషుల ముక్కులో ఈమందు స్ప్రే చేశారు. తరువాత వారు తీసుకునే ఆహార విషయాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో వారిలో ఆకలి మందగించడం కనిపించింది. 

అందుకే ఆకలి తక్కువగా..

ఈ స్ప్రే ముక్కుకు చేరినప్పుడు, మెదడు కేలరీలు తీసుకోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని భావిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అందువల్ల తక్కువ ఆకలి ఉంటుంది. మనుషుల కంటే ముందు జంతువులపై చేసిన పరిశోధనలో కూడా ఇది నిర్ధారణ అయింది.

భవిష్యత్తులో ఈ స్ప్రే బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

ఈ హార్మోన్ మెదడు  వెంట్రల్ టెగ్మెంట్ ప్రాంతం  కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఇది ఆకలిని ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో ఈ స్ప్రే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. 

అయితే, ఈ హార్మోన్ కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. వికారం, తక్కువ రక్తపోటు అదేవిధంగా  అసాధారణ హృదయ స్పందన వంటివి దీనితో వస్తాయి. 

ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని ఎందుకు అంటారు?

ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు, చేతులు పట్టుకున్నప్పుడు లేదా ముద్దు పెట్టుకున్నప్పుడు మెదడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. అందుకే ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అంటారు. ఈ ఆక్సిటోసిన్ గర్భిణీ స్త్రీలలో ప్రసవ నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..