Punjab New Cabinet: పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో చేరిన 15 మంది!

పంజాబ్ కొత్త మంత్రులు చండీగఢ్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

Punjab New Cabinet: పంజాబ్ లో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో చేరిన 15 మంది!
Punjab New Cabinet
Follow us
KVD Varma

|

Updated on: Sep 26, 2021 | 8:45 PM

Punjab New Cabinet: పంజాబ్ కొత్త మంత్రులు చండీగఢ్‌లో ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కెప్టెన్ క్యాబినెట్‌లో చేరిన బ్రహ్మ్ మొహీంద్ర, మన్‌ప్రీత్ బాదల్, ట్రిప్ట్ రజిందర్ బజ్వా, అరుణ చౌదరి, సుఖ్ సర్కారియా, రానా గుర్జిత్, రజియా సుల్తానా, విజయేంద్ర సింగ్లా, భరత్ భూషణ్ అశు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

వీరి తరువాత, రణ్ దీప్ నభా, రాజ్ కుమార్ వెర్కా, సంగత్ సింగ్ గిల్జియాన్, పరగత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వడింగ్, గుర్కీరత్ కోట్లీ, మొదటిసారి మంత్రులు అవుతున్నారు. ఈరోజు 15 మంది మంత్రులు పంజాబ్ ప్రభుత్వంలో చేరారు. ముఖ్యమంత్రి చరంజిత్ చన్నీ, ఇద్దరు డిప్యూటీ సిఎంలు సుఖజిందర్ రాంధవా, ఓపి సోని ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే, అంతకుముందు చివరి నిమిషంలో కుల్జీత్ నాగ్రాకు మంత్రి పదవి ఇవ్వకూడదని నిర్ణయించారు. అతని స్థానంలో, అమ్లోహ్ నుండి ఎమ్మెల్యే కాకా రణ్‌దీప్ నభా మంత్రి అయ్యారు. నగ్రా వర్కింగ్ హెడ్, కాబట్టి అతను సంస్థలో పని చేయాలి.

వ్యతిరేకత ఉన్నప్పటికీ, మంత్రి అయిన రానా

పంజాబ్‌లోని దోబా ప్రాంతానికి కళంక నాయకుడుగా పేరుపొందిన రానా గుర్జిత్‌ని అందరూ తీవ్వ్యరంగా వ్తియతిరేకించారు. అయినా ఆయన పేరు మంత్రి వర్గంలో చేర్చారు. దీంతో అయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు.   రాణా గుర్జిత్ 2017 లో కెప్టెన్ సర్కార్ మంత్రివర్గంలో ఉన్నారు. అప్పుడు ఇసుక మైనింగ్‌లోఆయన  పాత్రపై ఆరోపణలు ఎదుర్కొన్నాడు. రాహుల్ గాంధీ ఆమోదం తర్వాత, కెప్టెన్ రానా రాజీనామాను తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చాన్నీ ప్రభుత్వంలో మళ్లీ మంత్రి అయ్యారు.

ఈ మంత్రులు తిరిగి వచ్చారు..

మన్ ప్రీత్ బాదల్, విజయీంద్ర సింగ్లా, రజియా సుల్తానా, బ్రహ్మ మోహింద్ర, అరుణ చౌదరి, భరత్ భూషణ్ అషు, ట్రిప్ట్ రాజిందర్ బజ్వా,  సుఖ్ సర్కారియా పంజాబ్ కేబినెట్‌కి తిరిగి వచ్చారు. వీరు కాకుండా, రానా గుర్జిత్ ఇంతకు ముందు కెప్టెన్ క్యాబినెట్‌లో కూడా ఉన్నారు.

కొత్తగా మంత్రులు అయినవారు..

మొదటిసారి మంత్రులైన వారిలో రాజ్‌కుమార్ వెర్కా, పరగత్ సింగ్, సంగత్ గిల్జియాన్, గుర్కీరత్ కోట్లి, కాకా రణ్‌దీప్ నభా, అమరీందర్ సింగ్ రాజా వాడింగ్ ఉన్నారు.

వీరికి చోటు దక్కలేదు..

సాధు సింగ్ ధరంసోత్, బల్వీర్ సిద్ధు, రానా గుర్మీత్ సోధి, గురుప్రీత్ కంగర్, సుందర్ షామ్ అరోరా కెప్టెన్ క్యాబినెట్ నుండి కొత్త క్యాబినెట్‌లో చోటు దొరకలేదు.

Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!