AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ పై వార్ యోచనకు ట్రంప్ ఎందుకు స్వస్తి చెప్పారంటే ?

అమెరికా-ఇరాన్ మధ్య యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని వార్తలు వస్తున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద సైనిక దాడి యోచనను చివరిక్షణంలో ఉపసంహరించుకున్నారు. ఇరాన్‌పై గాల్లోకి లేచిన యుధ్ధ విమానాలు, క్షిపణులు హఠాత్తుగా వెనుదిరగడం ఆశ్చర్యకరం. అయితే ట్రంప్ అనూహ్యంగా వార్ విషయంలో వెనకడుగు వేయడానికి కారణం ఓ న్యూస్ ఛానల్ లో వఛ్చిన కార్యక్రమమే అంటే నమ్మలేం. ఇరాన్ పై యుధ్ధానికి రెడీ కావాలంటూ రక్షణ దళాలకు ఆదేశించిన ట్రంప్.. వైట్ హౌస్ […]

ఇరాన్ పై వార్ యోచనకు ట్రంప్ ఎందుకు స్వస్తి చెప్పారంటే ?
Team Veegam
| Edited By: |

Updated on: Jun 23, 2019 | 1:42 PM

Share

అమెరికా-ఇరాన్ మధ్య యుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని వార్తలు వస్తున్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద సైనిక దాడి యోచనను చివరిక్షణంలో ఉపసంహరించుకున్నారు. ఇరాన్‌పై గాల్లోకి లేచిన యుధ్ధ విమానాలు, క్షిపణులు హఠాత్తుగా వెనుదిరగడం ఆశ్చర్యకరం. అయితే ట్రంప్ అనూహ్యంగా వార్ విషయంలో వెనకడుగు వేయడానికి కారణం ఓ న్యూస్ ఛానల్ లో వఛ్చిన కార్యక్రమమే అంటే నమ్మలేం. ఇరాన్ పై యుధ్ధానికి రెడీ కావాలంటూ రక్షణ దళాలకు ఆదేశించిన ట్రంప్.. వైట్ హౌస్ లో కూచుని ఫాక్స్ న్యూస్ ఛానల్ లో వచ్చిన ఓ కార్యక్రమాన్ని చూశాడట.ఈ కార్యక్రమంలో టకర్ కార్ల్ సన్ అనే న్యూస్ ప్రెజెంటర్ ట్రంప్ గురించి చెప్పిన విషయాలు ఆయనను ఆలోచనలో పడేశాయని తెలుస్తోంది. ఇరాన్ తో యుధ్ధమే వస్తే.. అమెరికా ట్రిలియన్లకొద్దీ సొమ్మును నష్టపోవలసి వస్తుందని, పైగా ఇప్పటికప్పుడు వార్ కు దిగితే అది అమెరికాలో 2020 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని, పదవిపై ఆయన ఆశలు వదులుకోవలసి వస్తుందని కార్ల్ సన్ విశ్లేషించాడట. ఇతర దేశాలతో యుధ్ధాలు అమెరికాకు కలిసి రాలేదు.. ముఖ్యంగా యుధ్ధ కాంక్ష లేని ట్రంప్ కు ఉన్న ప్రతిష్ట మసకబారుతుందని కార్ల్ సన్ చెప్పడం కూడా ఆయనను పునరాలోచనలో పడేసినట్టు తెలుస్తోందని అమెరికా మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కాగా-అమెరికాపై ఎలాగైనా ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్న ఇరాన్.. ఆ దేశంపై సైబర్ దాడులకు దిగవచ్చునని వార్తలు వస్తున్నాయి. అమెరికా ప్రభుత్వ, ప్రయివేటు నెట్ వర్క్ లపై ఇరానియన్ హాకర్లు హ్యాకింగ్ ప్రయత్నాలకు దిగవచ్చునని అక్కడి సైబర్ సెక్యూరిటీ సంస్థలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ర్యాన్ సమ్ వేర్ అనే హానికారక టెక్నాలజీ సృష్టించిన సైబర్ క్రిమినల్స్ యూఎస్ లోని కొన్ని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎటాక్ లకు తలపడవచ్ఛునని తెలుస్తోంది. ర్యాన్ సమ్ వేర్ దాడుల అనంతరం తిరిగి ఈ స్థావరాల యాక్సెస్ కోసం ఇరాన్ లోని సిటీ కౌన్సిల్ కొన్ని సంస్థలకు అధికారమిస్తూ ఇందుకు కొంత సొమ్ము కూడా ముట్టజెబుతామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసలు ర్యాన్ సమ్ వేర్ అంటే.. ఇదొక ‘ మాలిషియస్ సాఫ్ట్ వేర్. ఇది ఓ సిస్టం ను సులభంగా బ్లాక్ చేయగలదు. దీన్ని అన్-లాక్ చేయాలంటే డబ్బులు కావాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తారు. దీన్ని సాధారణంగా ఓ సీక్రెట్ ఈ-మెయిల్ కి హ్యాకర్లు ఎటాచ్ చేస్తారని, 2013 నుంచి దీని పేరిట హ్యాకర్లు కనీసం 170 కౌంటీ సిటీ లేదా స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్స్ ని ఎటాక్ చేసి లక్షల డాలర్ల సొమ్ము గుంజారని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఒకవేళ అమెరికాపై సైబర్ దాడులకు దిగిన పక్షంలో అమెరికా.. స్వీయ రక్షణ చర్యలు తీసుకోక తప్పదు. ఇప్పటినుంచే అప్రమత్తం కాక తప్పదు.